Women Go For Drinking Water: మంచినీళ్ల కోసం వెళ్లిన మహిళలు.. అది చూసి పరుగో పరుగు..
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:58 PM
తాగు నీటి కోసం నీటి మడుగుకు వెళ్లిన మహిళలకు ఊహించని షాక్ తగిలింది. దీంతో వారంతా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి పరుగు తీశారు.
కర్నూలు, సెప్టెంబర్ 13: తాగు నీటి కోసం నీటి మడుగుకు వెళ్లిన మహిళలకు ఊహించని షాక్ తగిలింది. దీంతో వారంతా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి పరుగు తీశారు. ఇంతకీ ఏమైందంటే.. ఉమ్మడి కర్నూలు జిల్లా కౌతాళం మండలం రాజానగరం గ్రామానికి చెందిన మహిళలు వ్యవసాయ పనులకు వెళ్తారు. ఎప్పటి లాగానే శనివారం కూడా తాగు నీటి కోసం వారు.. ఎస్ఎస్ ట్యాంక్‌కు బిందులతో వెళ్లారు. అయితే ఆ ట్యాంక్‌లో ముసళ్లు తిరుగుతున్న విషయాన్ని వారు గమనించారు.
వెంటనే బిగ్గరగా కేకలు వేసుకుంటూ.. ఎస్ఎస్ ట్యాంక్ నుంచి బయటకు పరుగులు తీశారు. గత కొంతకాలంగా ఈ ట్యాంక్‌లో ముసళ్లు తిరుగుతున్నాయని పలుమార్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు. ఈ ట్యాంకులో రెండు నుంచి మూడు ముసళ్లు ఉన్నాయని వారు స్పష్టం చేస్తున్నారు. వీటిని వెంటనే పట్టుకోవాలంటూ ప్రభుత్వాధికారులకు వారు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంట్లోంచి పెద్దగా అరుపులు.. లోపలికెళ్లి చూడగా షాక్..
యువతిపై లైంగిక దాడి.. మీ దేశానికి వెళ్లాలంటూ నిందితులు ఆదేశం
For More AP News And Telugu News