Nandyal Crime: అల్లుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
ABN , Publish Date - Dec 18 , 2025 | 08:43 PM
అల్లుడితో కలిసి భర్తను హత్య చేసింది ఒక భార్య. ఈ దారుణ ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది.
నంద్యాల, డిసెంబర్ 18: జిల్లాలోని నందమూరి నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. చాకలి గుర్రప్ప అనే వ్యక్తిని భార్య హతమార్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడితో కలిసి.. భర్త గొంతు నులిమి చంపినట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంద్యాల ఏఎస్పీ ఎం.జావళి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. విచారణలో భాగంగా మృతుని భార్య పౌర్ణమిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గుర్రప్ప మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అల్లుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
గంజాయి కేసులో ఇద్దరు అరెస్ట్..
నంద్యాలలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండున్నర కిలోల గంజాయి సహా మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ జిల్లాల్లో నేరాలు ఎందుకు అధికమయ్యాయి.. విశ్లేషించండి: సీఎం ఆదేశం
విద్యార్థుల మృతి కేసులో నకిలీ పోలీసుల విచారణ.. వెలుగులోకి సంచలన విషయాలు
For More AP News And Telugu News