Chandrababu Naidu: ఆ జిల్లాల్లో నేరాలు ఎందుకు అధికమయ్యాయి.. విశ్లేషించండి: సీఎం ఆదేశం
ABN , Publish Date - Dec 18 , 2025 | 07:48 PM
మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో డీజీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అమరావతి, డిసెంబర్ 18: రాష్ట్రంలో శాంతిభద్రతలే ప్రభుత్వానికి ముఖ్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం రాజధాని అమరావతిలో జిల్లా కలెక్టర్ల సదస్సులో శాంతిభద్రతలపై జిల్లా ఎస్పీలు, కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. కొన్ని జిల్లాల్లో క్రైమ్ రేటు ఎక్కువగా ఉందని.. మరికొన్ని చోట్ల తక్కువగా ఉందన్నారు. కడప, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో ప్రాపర్టీ సంబంధిత కేసులు ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటో విశ్లేషించాలని ఉన్నతాధికారులకు ఆయన సూచించారు.
పోలీసింగ్ అంటే భయం ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 5.5 శాతం మేర నేరాల రేటు తగ్గిందని.. కానీ జిల్లాల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అన్నమయ్య, కోనసీమ, నెల్లూరు, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో ఎందుకు నేరాలు అధికమయ్యాయో విశ్లేషించాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో గతంతో పోలిస్తే 5.5 శాతం మేర నేరాల రేటు తగ్గిందని వెల్లడించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. అలాగే మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 16 జిల్లాల్లో నేరాలు బాగా తగ్గాయని.. మిగతా జిల్లాల్లో వేర్వేరు కారణాల వల్ల క్రైమ్ ట్రెండ్ పెరుగుతోందని వివరించారు. అన్నమయ్య లాంటి జిల్లాలో మైగ్రేషన్ లేబర్ కారణంగా నేరాలు జరుగుతున్నాయని ఆయన సోదాహరణగా వివరించారు. కిడ్నాపింగ్ లాంటి కేసులు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. 56 శాతం మేర డిటెక్షన్ రేట్, 55 శాతం మేర రికవరీ రేటు ఉందన్నారు.
ఎన్టీఆర్, పశ్చిమగోదావరి జిల్లాల సహా ఐదు జిల్లాల్లో సీసీటీవీల అనుసంధానంతో నేరాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని చెప్పారు. డీహెచ్ఎంఎస్.. ఆధునిక సాంకేతికత ద్వారా సీసీ కెమెరాల హెల్త్‌ను నమోదు చేస్తున్నామన్న ఈ సమావేశంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు వివరించారు. నగరంలో నిఘా కోసం 10 వేల సీసీ కెమెరాల డ్యాష్ బోర్డును కమ్యూనిటీ సహకారంతో రూపొందించామన్నారు. ఫేస్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని సీపీ రాజశేఖర్ బాబు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైఎస్ జగన్‌కు మంత్రి సత్యకుమార్ సవాల్
విద్యార్థుల మృతి కేసులో నకిలీ పోలీసుల విచారణ.. వెలుగులోకి సంచలన విషయాలు
For More AP News And Telugu News