Share News

Kurnool Road Accident: దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు.. స్పాట్ డెత్.. ఎంతమందంటే

ABN , Publish Date - Mar 11 , 2025 | 01:50 PM

Kurnool Road Accident: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. రెండు బైక్‌లను కర్నాటకకు చెందిన బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Kurnool Road Accident: దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు.. స్పాట్ డెత్.. ఎంతమందంటే
Kurnool Road Accident

కర్నూలు, మార్చి 11: కర్నూలు జిల్లాలో (Kurnool District) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదోని మండల పరిధిలోని పాండవగల్లు గ్రామం వద్ద రెండు బైక్‌లను కర్నాటక ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే నలుగురు స్పాట్‌లో మృతి చెందగా... తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని హుటాహుటిన ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నలుగురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గంగావతి డిపోకు చెందిన బస్సు ఆదోని నుంచి రాయచూర్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పెద్దతుంబలం పోలీసులు.. విచారణ చేపట్టారు.


Minister Narayana Amravati Announcement: రాజధాని అమరావతి.. ఏం జరిగిందో చెప్పేసిన మంత్రి నారాయణ

కర్ణాటక ఆర్టీసీ బస్సు ఆదోని నుంచి మంత్రాలయం వెళ్తున్న క్రమంలో పాండవగల్లు దగ్గర డ్రైవర్ ఓవర్ స్పీడ్‌గా వెళ్తూ ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లను ఢీకొట్టాడు. దీంతో రెండు బైక్‌లపై ఉన్న ఐదుమందిలో నలుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. మరోవైపు హోంగార్డు హేమాద్రి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ హేమాద్రి కూడా చనిపోయాడు. విషయం తెలిసిన వెంటనే మంత్రి టీజీ భరత్ స్పందిస్తూ గాయపడిన వ్యక్తి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అయితే గాయపడిన హోంగార్డు హేమాద్రిని కాపాడేందుకు మెరుగై చికిత్స అందించినప్పటికీ అతడి పరిస్థితి విషమించడంతో కన్నుమూశాడు. విషయం తెలిసిన వెంటనే ఐదుగురు వ్యక్తుల బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. తమ వారు చనిపోవడంతో ఆస్పత్రిలో బంధువుల రోధనలు మిన్నంటాయి. అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లను క్రాస్ చేస్తూ ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో స్పీడ్ కంట్రోల్ అవకపోవడంతో బైక్‌లను ఢీకొనడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్టీసీ బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


మృతులు వీరే..

ఈ ప్రమాదంలో ఆదోని మండలం కుప్పగళ్లు ప్రాంతానికి చెందిన వీరన్న, ఆదిలక్ష్మీ దంపతులు చనిపోయారు. అలాగే కర్నాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా మాన్వికి చెందిన హోంగార్డు హేమాద్రి, అతని భార్య నాగరత్న, కుమారుడు దేవరాజు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు మరణించారు.


ఇవి కూడా చదవండి...

Vamsi Case Update: వంశీ కేసు.. లేటెస్ట్ అప్డేట్ ఇదే

Special Needs Schools: ఏపీలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 11 , 2025 | 01:59 PM