Health Minister On Bus Accident: బస్సు ప్రమాదంపై స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి.. ఘటనపై కీలక ప్రకటన
ABN , Publish Date - Oct 24 , 2025 | 08:06 AM
కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కర్నూల్ జిల్లా: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఆసుపత్రిలో చేరిన 12 మందిలో ఆరుగురికి ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ అవ్వగా, ఒకరికి తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
ప్రమాద స్థలంలోనే భౌతిక కాయాలు ఉన్నందున పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఫోరెన్సిక్ వైద్యులను ఘటనాస్థలానికి పంపినట్లు మంత్రి తెలిపారు. అలాగే, భౌతిక కాయాల తరలింపునకు మహాప్రస్థానం వాహనాలు సిద్ధంగా ఉంచినట్లు, చనిపోయిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని వైద్య సేవల్లో ఎలాంటి లోపం రాకుండా చూడాలని సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు.
కాగా, హైదరాబాద్ టూ బెంగళూరుకు వెళ్తోన్న కావేరీ ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు సమీపంలో బైకును ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా, అందులో 20 మంది చనిపోయినట్లు సమాచారం. మిగిలిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Election Commission: సర్‌కు సన్నాహాలు చేయండి
Chennai: నాన్నే నేరస్తుడని నమ్మించేలా అమ్మను చంపేశాడు
For More Latest News