Share News

Dasara Navaratri 2025: అన్నపూర్ణ అవతారంలో అమ్మలగన్నయమ్మ..

ABN , Publish Date - Sep 24 , 2025 | 09:56 AM

నవరాత్రుల్లో ముచ్చటగా మూడోరోజు.. అంటే బుధవారం అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ.. ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువు తీరిన దుర్గమ్మ శ్రీఅన్నపూర్ణదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

Dasara Navaratri 2025: అన్నపూర్ణ  అవతారంలో అమ్మలగన్నయమ్మ..

విజయవాడ, సెప్టెంబర్ 24: దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి. దుర్గమ్మ తొలి రోజు శ్రీబాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో.. రెండో రోజు వేద మాత శ్రీ గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక ముచ్చటగా మూడోరోజు.. అంటే బుధవారం అమ్మలగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. దుర్గమ్మ శ్రీఅన్నపూర్ణదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సృష్టి, స్థితి, లయకు కారణభూతమైన దుర్గమ్మ.. సమస్త జీవకోటికి ప్రాణాధారమైన ఆహారాన్ని అందించే దేవతగా శ్రీ అన్నపూర్ణదేవిని భక్తులు కొలుస్తారు. అన్నం.. జీవుల మనుగడకు ఆధారం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపమని. ఉదకం నారాయణ స్వరూపమని పెద్దలు చెబుతారు. ఈ రూపంలో అమ్మవారిని పూజిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, కుశలత, వాక్‌శుద్ధి‌ సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు ఉవాచ. అన్నపూర్ణదేవిని పూజిస్తే.. ఆకలిదప్పులు తదితర బాధలు ఉండవని చెబుతారు.


అమ్మవారికి నైవేద్యంగా..

ఇక ఈ రోజు అన్నపూర్ణ దేవికి గంధంతోపాటు పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. అలాగే అన్నపూర్ణ దేవికి గారెలు, క్షీరాన్నం, దద్యోజనాన్ని నైవేద్యంగా పెడతారు.


అమ్మవారి రూపం.. అర్థం పరమార్థం..

అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది.. ఎందుకంటే.. ఎడమ చేతిలో బంగారు పాత్రతోపాటు తన భర్త ఈశ్వరునికి భిక్ష అందించే రూపంలో అన్నపూర్ణను దర్శించుకుంటే ఆకలి బాధలు ఉండవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ రూపంలో అమ్మవారిని ధ్యానిస్తే.. ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అమ్మవారి చేతిలోని అక్షయ పాత్ర సకల శుభాలను కలిగిస్తుంది. లోకంలో జీవుల ఆకలి తీర్చడంకన్నా మించినది ఏదీ లేదని ఈ అలంకారం వెనుక ఉన్న అర్థం పరమార్థం..

ఈ పూలతో పూజించాలి.. ఈ స్తోత్రాలు చదవాలి..

అన్నపూర్ణ దేవిని తెలుపు, పసుపు పూలతో పూజించాలి. ఈ మూడో రోజు అన్నపూర్ణాదేవి స్తోత్రాలతోపాటు ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్యలహరిని పారాయణం చేస్తే శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయని పెద్దలు చెబుతారు.

అన్నపూర్ణ దేవిని తెలుపు, పసుపు పూలతో పూజించాలి. ఈ రోజు అన్నపూర్ణాదేవి స్తోత్రాలతో పాటు ఆది శంకరాచార్యులు రచించిన సౌందర్యలహరి కూడా చదువుకుంటే శుభ ఫలితాలు పొందుతారని పురాణేతిహాసాల చెబుతున్నాయి.


బెజవాడ కనకదుర్గమ్మ..

ఇక ఈ రోజు అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ.. ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువు తీరిన దుర్గమ్మ శ్రీఅన్నపూర్ణదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకే అమ్మ వారని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రాత్రి 11.00 గంటల వరకు రద్దీ కొనసాగనుంది. అయితే మంగళవారం ఒక్క రోజు అమ్మవారిని లక్ష మంది భక్తులు దర్శించుకున్నారని దేవాలయ ఉన్నతాధికారులు వెల్లడించారు. అలాగే ప్రసాదం, దర్శన టికెట్ల ద్వారా దేవస్థానానికి భారీగా ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ రోజు సైతం లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అధికారుల అంచనా వేస్తున్నారు.


అధికారులు అప్రమ్తతం.. భారీగా పోలీసులు..

దసరా నవరాత్రులు నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా... దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు విజయవాడకు తరలి వస్తున్నారు. అమ్మవారి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అదీకాక.. విజయవాడలో కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో నదీ ఘాట్ల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందుకోసం విద్యుత్, నీటి పారుదల, దేవాదాయ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కమిషనర్ సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఇంకోవైపు నగరంలో విజయవాడ ఉత్సవ్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ ఉత్సవ్‌కు భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో భారీగా పోలీసులు మోహరించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్

అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు

For More AP News And Telugu News

Updated Date - Sep 24 , 2025 | 10:37 AM