Vice President Durga Temple: కుటుంబసమేతంగా దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి
ABN , Publish Date - Sep 24 , 2025 | 04:42 PM
ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచరం పొందారు.
విజయవాడ, సెప్టెంబర్ 24: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (Vice President CP Radhakrishnan) విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈరోజు (బుధవారం) ఇంద్రకీలాద్రి ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి ఎండోమెంట్ కమిషనర్ సీహెచ్ రామచంద్ర మోహన్, మినిస్టర్ పార్థసారథి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్చంద్, బోర్ర గాంధీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులను, మీడియా మిత్రులను కలిసి వైస్ ప్రెసిడెంట్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆపై ఇంద్రకీలాద్రి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచరం పొందారు. తరువాత అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని, చిత్రపటాన్ని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు ఆలయ ఈవో అందజేశారు.
కాగా.. విజయవాడ పర్యటన నిమిత్తం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఉపరాష్ట్రపతికి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి దుర్గమ్మ సన్నిధికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొననున్నారు వైస్ ప్రెసిడెంట్.
వీఐపీ, వీవీఐపీ దర్శనాలు రద్దు
మరోవైపు ఉపరాష్ట్రపతి దుర్గమ్మ దర్శనం నేపథ్యంలో ఆలయంలో వీఐపీ, వీవీఐపీ దర్శనాలు నిలుపుదల చేశారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి 6 గంటల వరకు వీఐపీ దర్శనాలు రద్దు చేశారు ఆలయ అధికారులు. వీఐపీలు, వీవీఐపీలు తమకి సహకరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
వారిపై పీడీయాక్ట్ కేసులు ఖాయం: మంత్రి నాదెండ్ల
విగ్రహాల ఏర్పాటుపై మండలిలో రచ్చ.. బొత్స వాకౌట్
Read Latest AP News And Telugu News