Share News

Tirupati temple: తిరుమలలో బ్రహ్మోత్సవాలు.. భక్తులు పాటించాల్సిన నిబంధనలు ఇవే..

ABN , Publish Date - Sep 24 , 2025 | 01:54 PM

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఏల్. సుబ్బరాయుడు వీడియో సందేశం ద్వారా ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు.

Tirupati temple: తిరుమలలో బ్రహ్మోత్సవాలు.. భక్తులు పాటించాల్సిన నిబంధనలు ఇవే..
irumala festival dos and don'ts

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఏల్. సుబ్బరాయుడు వీడియో సందేశం ద్వారా ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు (Brahmotsavam rules 2025). బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో పాటించాల్సిన నియమ నిబంధనలను తెలియజేశారు. దసరా సెలవులు కావడంతో తిరుపతికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.


శ్రీవారి దర్శనం, వాహన సేవలు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు (TTD darshan rules). అలిపిరి నుంచి తిరుమల వరకు భద్రతా చర్యలు పటిష్టం చేశామని, చిన్నారుల రక్షణ కోసం చైల్డ్ ట్యాగింగ్ సిస్టం అమలు చేస్తున్నామని తెలిపారు. భక్తులు తక్కువ లగేజీతో తిరుమలకు రావాలని, క్యూ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలని, వాహన సేవ సమయంలో చిల్లర నాణేలు విసరరాదని సూచించారు. వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే నిలపాలని, ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ఆర్టీసీ లేదా టీటీడీ బస్సులను వినియోగించాలని పేర్కొన్నారు (Tirumala festival dos and don'ts).


మత్తు పదార్థాలు, మద్యం తీసుకొని తిరుమలకు వస్తే కఠిన చర్యలు తప్పవని, ఘాట్ రోడ్లలో ర్యాష్ డ్రైవింగ్ నిషేదమని జిల్లా ఎస్పీ తెలిపారు (Tirupati temple guidelines). గ్యాలరీల్లో కూర్చుని ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా శ్రీవారి సేవలను తిలకించాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే 112 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే సోషల్ మీడియాను బాధ్యతగా వాడుకోవాలని, టీటీడీ గురించి నిరాధార ఆరోపణలు, అసభ్య వ్యాఖ్యలు చేయకూడదని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

రాజధానిపై మూడు ముక్కలాట.. గత సర్కార్‌పై మంత్రి ఫైర్

వారిపై పీడీయాక్ట్ కేసులు ఖాయం: మంత్రి నాదెండ్ల

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 24 , 2025 | 01:54 PM