Share News

Vangaveeti Asha Kiran: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరం.. మరోతరం అరంగ్రేటం

ABN , Publish Date - Nov 16 , 2025 | 10:29 AM

వంగవీటి రంగా ఆశయ సాధన కోసం తాను కృషి చేస్తానని తన కుమార్తె ఆశా కిరణ్ ఉద్ఘాటించారు. ప్రజల జీవితానికి కొంత కాలంగా దూరంగా ఉన్నానని తెలిపారు. ఇకపై పూర్తిగా తన జర్నీ ప్రజలతోనేనని.. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.

Vangaveeti Asha Kiran:  ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరం.. మరోతరం అరంగ్రేటం
Vangaveeti Asha Kiran

విజయవాడ, నవంబరు16 (ఆంధ్రజ్యోతి): ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయాల్లో వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ (Vangaveeti Asha Kiran) రాజకీయాల్లో అరంగ్రేటం చేయనున్నారు. ఈ మేరకు ప్రజలతో తాను మమేకం అవుతానని.. ఇక నుంచి పాలిటిక్స్‌లో యాక్టివ్ అవుతానని వ్యాఖ్యానించారు. ఇవాళ(ఆదివారం) వంగవీటి రంగా విగ్రహానికి నివాళులు అర్పించి త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు ఆశ కిరణ్. ఈ సందర్భంగా ఆశా కిరణ్ మీడియాతో మాట్లాడారు. రాధా, రంగా మిత్రమండలి ఆహ్వానం మేరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు.


రంగా ఆశయ సాధన కోసం తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల జీవితానికి కొంతకాలంగా తాను దూరంగా ఉన్నానని.. ఇకపై పూర్తిగా తన జర్నీ ప్రజలతోనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. రాధా, రంగా మిత్రా మండలి మధ్య కొంత గ్యాప్ ఉందని పేర్కొన్నారు. ఆ గ్యాప్ ఫుల్ ఫిల్ చేయడానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నానని వివరించారు. కులం, మతం బేధం లేకుండా సహాయం చేశారని వంగవీటి రాధా, రంగాలని కీర్తించారు ఆశా కిరణ్.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీ మద్యం కుంభకోణం.. అనిల్ చోకరా అరెస్ట్

టీడీపీలో విషాదం.. సీనియర్ నేత కన్నుమూత

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 16 , 2025 | 10:43 AM