Tiruvuru Municipal Council: వైసీపీ ఆందోళన.. తిరువూరు కౌన్సిల్ సమావేశంలో గందరగోళం
ABN , Publish Date - Sep 29 , 2025 | 04:32 PM
మానవతా దృక్పథంతో తమ ఇద్దరు కౌన్సిలర్ల సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటూ వైసీపీ సభ్యులు చేసిన విజ్ఞప్తిని తిరువూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ తిరస్కరించారు. ఇద్దరు మహిళా కౌన్సిలర్లు పెట్టుకున్న విజ్ఞప్తిని ఎజెండాలో అధికారులు పొందుపర్చారు.
ఎన్టీఆర్ జిల్లా, సెప్టెంబర్ 29: తిరువూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో (Tiruvuru Municipal Council) గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వివాదంతో తిరువూరు నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం దద్దరిల్లింది. వైసీపీ సభ్యులు ఛైర్ పర్సన్ పోడియాన్ని చుట్టిముట్టి సభను అడ్డుకున్నారు. అజెండాలో పొందుపర్చిన అంశాలపై చర్చ జరగకుండా వైసీపీ సభ్యులు వ్యక్తిగత అంశాలను సభలో లేవనెత్తారు. ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు వరసగా మూడు కౌన్సిల్ సమావేశాలకు డుమ్మా కొట్టారు. దీంతో ఛైర్ పర్సన్ వారిపై అనర్హత వేటు వేశారు. ఈ క్రమంలో మానవతా దృక్పథంతో తమ ఇద్దరు కౌన్సిలర్ల సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటూ వైసీపీ సభ్యులు చేసిన విజ్ఞప్తిని ఛైర్ పర్సన్ తిరస్కరించారు. ఇద్దరు మహిళా కాన్సిలర్లు పెట్టుకున్న విజ్ఞప్తిని అధికారులు ఎజెండాలో పొందుపర్చారు. అయితే వైసీపీ సభ్యుల విజ్ఞప్తికి టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు.
వైసీపీ సభ్యుల సభ్యత్వాన్ని ఆమోదించటం లేదని ఛైర్ పర్సన్ చెప్పటంతో సమావేశంలో ఓటింగ్‌కు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. ఓటింగ్‌లో 10 మంది టీడీపీ సభ్యులు వారి సభ్యత్వం పునరుద్ధరణకు వ్యతిరేకంగా ఓటు వేయగా 9 మంది వైసీపీ సభ్యులు అనుకూలంగా ఓటు వేయటంతో మరోసారి వైసీపీ సభ్యులు.. ఛైర్ పర్సన్ పోడియాన్ని చుట్టుముట్టి సభను అడ్డుకున్నారు. ఇద్దరు వైసీపీ సభ్యుల అనర్హత వేటుపై ఓటింగ్‌ను మినిట్స్‌లో రికార్డు చేసి సభ్యులు సంతకాలతో మున్సిపల్ ఉన్నతాధికారుల అనుమతి కోసం డీఎంఏకు అధికారులు నివేదించారు. రానున్న సమావేశాలకు ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు తమ పదవి కోల్పోయే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
ప్రకాశం బ్యారేజ్‌కు వరద ఉధృతి.. మంత్రి ఆదేశాలివే
తిలక్ వర్మ గిఫ్ట్.. తమ్ముడూ అంటూ లోకేష్ ట్వీట్
Read Latest AP News And Telugu News