Share News

Prakasam Barrage Flood: ప్రకాశం బ్యారేజ్‌కు వరద ఉధృతి.. మంత్రి ఆదేశాలివే

ABN , Publish Date - Sep 29 , 2025 | 01:37 PM

కృష్ణానది కరకట్ట వెంబడి పరిస్థితిని అధికారులు ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని మంత్రి సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవిన్యూ అధికారులకు, పోలీసులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Prakasam Barrage Flood: ప్రకాశం బ్యారేజ్‌కు వరద ఉధృతి.. మంత్రి ఆదేశాలివే
Prakasam Barrage Flood

అమరావతి, సెప్టెంబర్ 29: ప్రకాశం బ్యారేజ్‌కు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satyaprasad) హెచ్చరించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రేపల్లె , వేమూరు నియోజకవర్గ కరకట్టకు అనుకుని ఉన్న లంక గ్రామాల ప్రజలను అధికారులు నిరంతరం అప్రమత్తం చేయాలని ఆదేశించారు. కృష్ణానది కరకట్ట వెంబడి పరిస్థితిని అధికారులు ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవిన్యూ అధికారులకు, పోలీసులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.


కరకట్ట ప్రాంతంలో గండి పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. కృష్ణా నది పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు నదిని గానీ, కాలువలను గానీ దాటే ప్రయత్నం చేయవద్దని.. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. సోషల్ మీడియాలో జరిగే వదంతులను నమ్మవద్దన్నారు. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కునేందుకు రాష్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పష్టం చేశారు.


కాగా.. ప్రకాశం బ్యారేజీకి వరద భారీగా పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్‌ ఇన్‌ ఫ్లో, ఔట్‌ ఫ్లో 6.81 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు బ్యారేజీ 69 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి వరద నీటిని విడుదల చేశారు. వరద ఉధృతి నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత అధికారులను రెవెన్యూ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. విజయవాడ బెర్న్‌పార్క్‌ వద్ద టూరిజం సిబ్బంది అప్రమత్తమైంది. పర్యాటకశాఖ బోట్లను డ్రైవర్లు తాళ్లతో కట్టేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారితో పాటు లంక ప్రాంతం వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ప్రవాహం నేపథ్యంలో అక్టోబర్ రెండున జరిగే దుర్గమ్మ తెప్పోత్సవం కేవలం నది ఒడ్డుకే పరిమితం చేసే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి..

సీఐఐ సదస్సుకు ఎల్జీ సంస్థకు ప్రత్యేక ఆహ్వానం

దారుణం.. విద్యార్థిని కాళ్లతో తన్నుతూ దాడి...

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 29 , 2025 | 01:48 PM