AP Ministers South Korea: సీఐఐ సదస్సుకు ఎల్జీ సంస్థకు ప్రత్యేక ఆహ్వానం
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:38 PM
ఎల్జీ కార్యాలయానికి విచ్చేసిన మంత్రులు పి. నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డిల బృందానికి ఎల్జీ సంస్థ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలను ఈ సందర్భంగా ఎల్జీ ప్రతినిధులకు మంత్రులు వివరించారు.
అమరావతి/దక్షిణ కొరియా, సెప్టెంబర్ 29: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు పి.నారాయణ(Minister Narayana), బీసీ జనార్ధన్ రెడ్డిల (BC Janardhan Reddy) బృందం పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఎల్జీ కంపెనీ ప్రతినిధులతో మంత్రులు భేటీ అయ్యారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ ఎల్జీ సంస్థ హెడ్ క్వార్టర్‌లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎల్జీ కార్యాలయానికి విచ్చేసిన మంత్రులు పి. నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డిల బృందానికి ఎల్జీ సంస్థ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలను ఈ సందర్భంగా ఎల్జీ ప్రతినిధులకు మంత్రులు వివరించారు.
అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఎల్జీ సంస్థ ప్రతినిధులను మంత్రులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌లో సుస్థిర ప్రభుత్వంతో అభివృద్ధి తీరుతెన్నులు, పెట్టుబడిదారులకు ఉన్న అపార అవకాశాలపై మంత్రుల బృందం వివరించింది. ఈ సమావేశంలో అధికారులు ఎం.టీ.కృష్ణ బాబు, కాటంనేని భాస్కర్, ఈడీబీ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సరస్వతీ దేవిగా దుర్గమ్మ.. కిలో మీటర్ల మేర క్యూలైన్లో భక్తులు
శ్రీవారి బ్రహ్మోత్సవాలపై సీఎం చంద్రబాబు ట్వీట్
Read Latest AP News And Telugu News