Tilak Verma Nara Lokesh: తిలక్ వర్మ గిఫ్ట్.. తమ్ముడూ అంటూ లోకేష్ ట్వీట్
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:04 PM
మంత్రి నారా లోకేష్‌కు తిలక్ వర్మ ప్రత్యేక బహుమతిని బహూకరించాడు. ‘లోకేష్ అన్నా నీకోసం ప్రత్యేక బహుమతి’ అంటూ తన క్యాప్ బహుకరించాడు తిలక్.
అమరావతి, సెప్టెంబర్ 29: ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (Tilak Verma).. మంత్రి నారా లోకేష్‌కు (Minister Nara Lokesh) ప్రత్యేక బహుమతి ఇచ్చారు. 'లవ్ యూ అన్నా.. ఇది నీకోసమే' అంటూ తిలక్ వర్మ ఇచ్చిన బహుమతి పట్ల లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తిలక్ వర్మ గిఫ్ట్‌పై స్పందించారు మంత్రి లోకేష్. ఇది తనకు ఎంతో ప్రత్యేకమంటూ కొనియాడారు. ఇంతకీ తెలుగు కుర్రాడు మంత్రికి ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసుకుందాం.
ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్ తొమ్మిదవ సారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆఫ్ సెంచరీ చేశాడు. ఇక విజయం తర్వాత ఏపీ మంత్రి నారా లోకేష్‌కు తిలక్ వర్మ ప్రత్యేక బహుమతిని బహూకరించాడు. ‘లోకేష్ అన్నా నీ కోసం ప్రత్యేక బహుమతి’ అంటూ తన క్యాప్ బహుకరించాడు తిలక్. మ్యాచ్‌లో ఆడిన క్యాప్‌ను ఎంతో ప్రేమతో లోకేష్‌కు ఇస్తున్నట్లు తెలిపాడు. ఆ క్యాప్‌పై ‘లవ్ యూ లోకేష్ అన్నా’ అంటూ రాశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లోకేష్ ట్వీట్..
ఇక.. తిలక్ వర్మ బహుమతి పట్ల మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. తమ్ముడు తిలక్ వర్మ బహుమతి తనకెంతో ప్రత్యేకమైనదంటూ మంత్రి ఎక్స్‌లో ట్వీట్ చేశారు. స్వదేశానికి తిరిగి వచ్చాక తిలక్ వర్మ చేతుల మీదుగానే క్యాప్‌ను స్వయంగా తీసుకుంటానని మంత్రి లోకేష్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
దారుణం.. విద్యార్థిని కాళ్లతో తన్నుతూ దాడి...
ప్రకాశం బ్యారేజ్‌కు వరద ఉధృతి.. మంత్రి ఆదేశాలివే
Read Latest AP News And Telugu News