Chicken: కుళ్లిన, నిల్వ చికెన్ విక్రయాలు.. రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు
ABN , Publish Date - Oct 20 , 2025 | 08:27 PM
చికెన్‌ను లొట్టలేసుకుంటూ తింటున్నారా..? అయితే కాస్త ఆగండి. హోటల్లో అయినా, ఇంట్లో అయినా మీరు తినే చికెన్ ఎంత వరకు నాణ్యమైనదో తెలుసుకున్న తరువాతనే ఆరగించండి. కుళ్లిన, నిల్వ ఉన్న చికెన్ ను మీకు అమ్మి చీటింగ్..
విజయవాడ సిటీ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) నగరంలోని ప్రజలకు కుళ్లిన, నిల్వ ఉన్న మాంసాన్ని విక్రయిస్తున్న విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ మోసాన్ని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్ చంద్ర చండు ప్రకాష్ నాయుడు పసిగట్టారు. తన సిబ్బంది, మున్సిపల్, పశు సంవర్ధక శాఖ ఆధికారులతో తనిఖీలు చేసి చికెన్ షాపుల్లో జరుగుతున్న చీటింగ్ బయటపెట్టారు. మొగల్రాజపురం, పటమటలంక ప్రాంతాల్లోని రెండు దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన ఈ బృందం ఒళ్లు గగుర్పొడిచే అంశాలను మన మందుకు తీసుకొచ్చింది. ఫుడ్ సేఫ్టీ అధికారి రవీంద్రరెడ్డి, మున్సిపల్ వెటర్నరీ డాక్టర్ సోమశేఖరరెరెడ్డి, మాంసాభివృద్ధి కార్పోరేషన్ అసిస్టెంట్ డైరక్టర్లు డాక్టర్ సుధామాధురి, డాక్టర్ ఎ. వీరప్రసాద్, సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
ఆ ప్రాంతంలోని ప్రజలు ఎక్కువ మంది సదరు షాపులోనే చికెన్ కొను గోలు చేస్తుంటారు. పెద్ద సంఖ్యలో ప్రజలకు చికెన్ అమ్మే ఈ షాపు లోపలకు వెళ్లిన ఈ బృందం ఒక్కసారిగా కంగుతింది. మాంసం. ప్రాసెస్ చేసే ప్రాంతాలు దుర్భరంగా ఉన్నాయి. వారం రోజుల క్రితం మాంసం ఫ్రీజ్లో ఉంది. 24 గంటల క్రితం చనిపోయిన కోళ్లు ర్యాక్ లోనే ఉన్నాయి. నాలుగు రోజులుగా కోళ్ల వ్యర్ధా లను అక్కడ నుంచి బయలకు తీసుకెళ్లలేదు. పైకి అత్యంత ఆకర్షణీయంగా కనిపించే ఈ షాపు లోపల ఉన్న వాతావరణం చూసి ఈ బృందం ఒక్కసారిగా బిత్తరపోయింది. వెంటనే దుకాణంపై కేసు నమోదు చేసింది. నిల్వ ఉన్న మాంసంపై బ్లీచింగ్ చల్లి అక్కడ నుంచి తరలించింది.
తరువాత.. పటమటలంక కృష్ణవేణి రోడ్డులోని ఓ దుకాణంలోనూ నిల్వ ఉన్న మాం సాన్ని ఈ బృందం గుర్తించింది. అక్కడైతే ఏకంగా టాయిలెట్ పక్కనే మాంసాన్ని నిల్వ చేశారు. కొనుగోలుదారులు రాగానే అదే మాంసాన్ని అంటగడుతున్నట్లు ఈ బృందం గుర్తించింది. కోళ్ల వ్యర్థాలు, అపరిశుభ్రంగా ఉన్న ఈ దుకాణంపైనా వారు కేసు నమోదు చేశారు. ఈ షాపు నుంచి అత్యధికంగా హోటళ్లకు చికెన్ సరఫరా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ.. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఈ సంస్థను నెలకొల్పారన్నారు. నాసిరకు మాంసాన్ని విక్రయించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ పేరు వింటే.. శత్రువులకు నిద్ర పట్టదు: ప్రధాని మోదీ
For More National News And Telugu News