Deputy CM Pawan: అప్పినపల్లి గ్రామస్తులను మెచ్చుకున్న పవన్.. ఎందుకంటే
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:27 PM
ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకున్న ప్రజలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ల వాహనాన్ని అప్పినపల్లి గ్రామస్తులు వెంబడించి మరీ పట్టుకున్నారు.
అమరావతి, నవంబర్ 14: ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకున్న ప్రజలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) అభినందించారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ల వాహనాన్ని అప్పినపల్లి గ్రామస్తులు వెంబడించి మరీ పట్టుకున్నారు. దీంతో అప్పినపల్లి గ్రామస్తుల ధైర్యాన్ని పవన్ మెచ్చుకున్నారు. పవన్ స్ఫూర్తితోనే స్మగ్లర్లను పట్టుకున్నామని ప్రజలు చెప్పుకొచ్చారు. ఈ వివరాలను డిప్యూటీ సీఎం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈరోజు (శుక్రవారం) ఉదయం తిరుపతి ఫ్లయింగ్ స్క్వాడ్ పులిచర్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక టవెరా వాహనం అనుమానాస్పదంగా దూసుకువెళ్లింది. అటవీ అధికారులు ఆ వాహనాన్ని వెంబడించగా వారు బెంగళూరు వైపు వేగంగా వెళ్లిపోయారు. మార్గమధ్యంలో వాహనం నుంచి దూకి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. వాహనంలో ఉన్న డ్రైవర్ వేగంగా నడుపుకొంటూ ముందుకు వెళ్లాడు. అయితే అటవీ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారంతో చిత్తూరు జిల్లా, అప్పినపల్లి గ్రామస్తులు ఆ వాహనాన్ని వెంబడించారు.
దీంతో డ్రైవర్ కూడా వాహనాన్ని ఒక పక్కన ఆపి పారిపోయాడు. అటవీశాఖ అధికారులు, పోలీసులు ఆ వాహనాన్ని తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న 10 ఎర్రచందనం దుంగలు దొరికాయి. ఎర్రచందనం దొంగల ఆటకట్టించే క్రమంలో గ్రామస్తులు చూపిన చొరవ, ధైర్యాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు. అలాగే అటవీశాఖ అధికారులు, పోలీసులను పవన్ కళ్యాణ్ అభినందించారు.
ఇవి కూడా చదవండి...
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపుపై కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్
బిహార్ ఎన్నికల ఫలితాలపై సీఎం ఏమన్నారంటే..
Read Latest AP News And Telugu News