Share News

Lokesh Slams Jagan: ఇకనైనా ఫేక్ ప్రచారాలు మానుకో.. జగన్‌పై లోకేష్ ఫైర్

ABN , Publish Date - May 10 , 2025 | 03:09 PM

Lokesh Slams Jagan: కుట్టు మిషన్లకు సంబంధించి జగన్ చేసిన ఫేక్ ప్రచారంపై మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అంతా తన సొంత నిధులతోనే చేసినట్లు మంత్రి తెలిపారు.

Lokesh Slams Jagan: ఇకనైనా ఫేక్ ప్రచారాలు మానుకో.. జగన్‌పై లోకేష్ ఫైర్
Lokesh Slams Jagan

అమరావతి, మే 10: ప్రభుత్వ సొమ్ముతో కుట్టుమిషన్లను కొని పసుపు రంగు వేసి అందిస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Former CM YS Jagan) చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) ఫైర్ అయ్యారు. ఫేక్ పార్టీ వైసీపీకి మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో జనం సొమ్ము దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. జనం సొమ్మును కాజేయాలనే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా లేని సమయంలో కూడా మంగళగిరి ప్రజలకు స్వ‌యం ఉపాధికి ఆర్థిక సాయంతో చేయూతనందించానని.. అందంతా తన సొంత నిధులతో చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇకనైన ఫేక్ ప్రచారాలు మానుకో అంటూ జగన్‌పై సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


లోకేష్ ట్వీట్ ఇదే..

‘జ‌గ‌న్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్ర‌జ‌ల‌ని గాలికి వ‌దిలేసి, జ‌నం సొమ్ము దోచుకోవ‌డమే ప‌నిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అప్పుడు నేను ఎమ్మెల్యేనీ కూడా కాను. ప్ర‌జ‌ల కోస‌మే పుట్టిన తెలుగుదేశం పార్టీ నాయ‌కుడిగా, నా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు స్వ‌యం ఉపాధికి చేయూత‌నందించాల‌ని నిర్ణ‌యించుకున్నాను. మ‌హిళ‌లు, చేనేత‌లు, స్వ‌ర్ణ‌కారులు, చిరువ్యాపారుల‌కు అవ‌స‌ర‌మైన సామాగ్రి, ఆర్థిక సాయంతో చేయూత‌నందించాను. వీట‌న్నింటికీ నా సొంత నిధులు వెచ్చించాను. కుల‌, మ‌త అంత‌రాలు పాటించ‌కుండా... త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డాల‌నుకునే మ‌హిళామ‌ణులు వేలాది మందికి స్త్రీశ‌క్తి పేరుతో ఉచితంగా శిక్ష‌ణ ఇచ్చాము. ట్రైనింగ్ పూర్త‌య్యాక స‌ర్టిఫికెట్లు, ఉచితంగా టైల‌రింగ్ మిష‌న్‌, మెటీరియ‌ల్ అంద‌జేశాను’ అని చెప్పుకొచ్చారు.


‘మంగ‌ళ‌గిరి స్త్రీ శ‌క్తి కేంద్రం 2022,జూన్‌20న ప్రారంభించాం. ఈ కేంద్రం ఇప్ప‌టి వ‌ర‌కూ 43 బ్యాచుల్లో 2226 మంది శిక్ష‌ణ పూర్ తిచేసుకోగా, వీరంద‌రికీ మిష‌న్లు అంద‌జేశాం. తాడేప‌ల్లిలో స్త్రీ శ‌క్తి కేంద్రం 2023, ఫిబ్ర‌వ‌రి 1న ప్రారంభ‌మైంది. ఇక్క‌డ 17 బ్యాచుల్లో శిక్ష‌ణ తీసుకున్న 666 మందికి మిష‌న్లు ఉచితంగా ఇచ్చాం. దుగ్గిరాల‌లో 2023 ఏప్రిల్ 10న ఆరంభించిన స్త్రీశ‌క్తి కేంద్రంలో 16 బ్యాచుల్లో 616 మంది ట్రైనింగ్ పూర్తి చేసుకోగా, వీరంద‌రికీ మిష‌న్లు పంపిణీ చేశాం. ఇప్ప‌టి వ‌ర‌కూ 3508 మందికి శిక్ష‌ణ పూర్ తిచేసి, ఉచితంగా నాణ్య‌మైన కుట్టు మిష‌న్లు అంద‌జేశాం. ఇవ‌న్నీ నా జేబులోంచి తీసిన డ‌బ్బులు, నా ఖాతాల నుంచి వెచ్చించిన సొమ్ములు కాబ‌ట్టే...శుభానికి సంకేత‌మైన నా పార్టీ ప‌సుపు రంగు మిష‌న్లు ఇచ్చాను. జ‌నం సొమ్ముతో పెట్టిన ప‌థ‌కాల‌కు నీలా పార్టీ రంగులు, నీ పేర్లు పెట్టుకోవాల‌నే యావ మాకు లేదు. నీ అబ‌ద్ధం తాత్కాలికం. మా నిజం శాశ్వ‌తం. ఇకనైనా ఫేక్ ప్రచారాలు మానుకోవాలి’ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: ఆర్మీకి విరాళాల వెల్లువ.. నెల జీతం ఇచ్చిన ఏపీ స్పీకర్

Operation Sindoor: ఇండియాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. తుస్సుమంటున్న పాక్ మిస్సైల్స్..

Read Latest AP News And Telugu News

Updated Date - May 10 , 2025 | 03:54 PM