Share News

Konaseema Fire Accident: క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి: మంత్రి లోకేష్

ABN , Publish Date - Oct 08 , 2025 | 04:45 PM

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి లోకేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Konaseema Fire Accident: క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి: మంత్రి లోకేష్
Konaseema Fire Accident

అమరావతి , అక్టోబర్ 8: కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంపై మంత్రి లోకేష్ (Minister Nara Lokesh) స్పందించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మంటల్లో చిక్కుకుని కార్మికులు సజీవ దహనం కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే ఆరా తీసిందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి లోకేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


కోనసీమ జిల్లాలో బాణసంచా పేలుడు ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో పలువురు చనిపోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక అధికారులతో మాట్లాడి బాధితులకు అందిస్తున్న సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాణసంచా తయారీ సమయంలో భద్రతా నిబంధనల అమలుపై దృష్టి పెట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు.


ఇవి కూడా చదవండి...

రూ.1.14లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ గ్రీన్ సిగ్నల్

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం.. అగ్నిప్రమాదంపై సీఎం

Read Latess AP News And Telugu News

Updated Date - Oct 08 , 2025 | 05:15 PM