Share News

Chilli Price: శివరాత్రి ముందు మిర్చి రైతులకు పండగలాంటి వార్త.. కేంద్ర ప్రకటనపై రైతుల హర్షం

ABN , Publish Date - Feb 25 , 2025 | 12:45 PM

Chilli Farmers: ఏపీ మిర్చి రైతులకు కేంద్ర శుభవార్త చెప్పింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద మిర్చి ధర నిర్ధారిస్తూ ఏపీకి కేంద్రం నుంచి లేఖ వచ్చింది. అమ్మకం ధరకు ఇన్ట్రవెన్షన్ ధర 25 శాతంగా ఉండాలని నిర్ధారించారు.

Chilli Price: శివరాత్రి ముందు మిర్చి రైతులకు పండగలాంటి వార్త.. కేంద్ర ప్రకటనపై రైతుల హర్షం
Chilli Price

అమరావతి, ఫిబ్రవరి 25: మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (Market Intervention Scheme) కిందకు మిర్చి చేరింది. క్వింటాల్‌కు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద మిర్చి ధరను (Chilli Price) 11,781.25 రూపాయలుగా నిర్ధారించారు. అమ్మకం ధరను అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలోని కమీటీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. అమ్మకం ధర కు ఇన్ట్రవెన్షన్ ధర 25 శాతంగా ఉండాలని నిర్ధారించారు. ఈమేరకు స్పెషల్ ఛీప్ సెక్రటరీ అగ్రికల్చర్‌కు కేంద్ర వ్యవసాయ శాఖ డిప్యూటీ కమీషనర్ వినోద్ గిరి లేఖ రాశారు. గుర్తింపు ఉన్న ఏపీఎంసీ మండీలలో అమ్మే వారికి ఈ స్కీం వర్తింస్తుందని వెల్లడించారు.


ఈ స్కీం కింద మొదటి ట్రాన్షక్షన్ నుంచి నెల రోజులు పాటు ధర అమలు చేయనున్నారు. రైతులు నష్టపోకుండా ఇచ్చే మార్కెట్ ఇంటర్వెన్షన్‌ను 50:50 శాతంగా వర్తింపజేయనున్నారు. ఈ పథకం కింద ట్రేడర్‌లను గుర్తించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. పథకం అమలుకు ముందు నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చితే తరువాత రీ ఎంబర్స్ చేస్తామని లేఖలో పేర్కొన్నారు.

పోలీసు కస్టడీకి వంశీ.. ప్రశ్నలు సిద్ధం


మిర్చి రైతుల ఆందోళనల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వెంటనే కేంద్ర పెద్దలతో మాట్లాడి మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా సీఎం స్వయంగా ఢిల్లీ వెళ్లి వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయ్యారు. ఆ తరువాత వ్యవసాయశాఖ అధికారులు అత్యవసరంగా భేటీ అయ్యి మిర్చి ధరపై నిర్ణయం తీసుకోవడంతో కొంత వరకు ఊరట లభించింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద క్వింటాల్ మిర్చి ధర రూ.11,781గా నిర్ధారించింది. అలాగే అమ్మకం ధరను అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలోని కమీటీ నిర్ణయిస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. రైతులు నష్టపోకుండా ఇచ్చే మార్కెట్ ఇంటర్వెన్షన్‌ను 50శాతం కేంద్ర ప్రభుత్వం, 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేలా నిర్ణయం తీసుకుంది. కేంద్ర వ్యవసాయ శాఖ డిప్యూటీ కమీషనర్ లేఖపై మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


గత కొంతకాలంగా మిర్చి ధర పడిపోతుండటంతో రైతులు ఆందోళన పడుతున్నారు. రాష్ట్రమే ధర నిర్ణయించాలని భావించినప్పటికీ.. ధరను నిర్ణయిస్తే మరింత పడిపోయే ప్రమాదం సర్కార్ భావించింది. భవిష్యత్‌లో మలేషియా, శ్రీలంక, చైనా దేశాల్లో మిర్చి కొరత ఉన్న నేపథ్యంలో ధర పెరిగే అవకాశం ఉన్నందున ధర నిర్ణయిస్తే ధరలు పడిపోయే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ముందుకు రాని పరిస్థితి. అయితే ప్రస్తుతం రైతులకు మేలు చేసేలా కేంద్రంతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

మోసం చేస్తూనే ఉంటా.. జగన్ కొత్త నినాదం..!

ఎండకాలంలో హ్యాపీ లైఫ్ కోసం అద్భుత చిట్కాలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 25 , 2025 | 12:45 PM