Share News

Parthasarathi Blasts YSRCP: ‘నా బీసీ’ మాటలు అర్ధరహితం.. జగన్‌పై మంత్రి పార్థసారథి సెటైర్లు

ABN , Publish Date - Sep 30 , 2025 | 03:05 PM

జగన్ పాలనలో అన్ని ముఖ్యమైన పదవుల్లో గానీ, అఖరికి పార్టీ పదవుల్లో కూడా అగ్రవర్ణలతో, వారి సంబంధించిన సామాజికవర్గంతో ప్రభుత్వాన్ని నడిపారని మంత్రి పార్థసారథి విమర్శించారు. వైసీపీ రౌడీల చేతుల్లో, వైసీపీ ఆరాచక శక్తుల చేతుల్లో చంద్రయ్య బలయ్యాడని.. అన్యాయంగా బలైన చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

Parthasarathi Blasts YSRCP: ‘నా బీసీ’ మాటలు అర్ధరహితం.. జగన్‌పై మంత్రి పార్థసారథి సెటైర్లు
Parthasarathi Blasts YSRCP

అమరావతి, సెప్టెంబర్ 30: నేతి బీరకాయలో నేతి ఎలా అయితే ఉండదో.. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ చెప్పుకునే జగన్ రెడ్డికి ప్రేమ కూడా అదే విధంగా ఉంటుందని మంత్రి కొలుసు పార్థసారథి (Minister Kolusu Parthasarathi) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ సామాజిక న్యాయమని చెప్పడమే కానీ, ఆచరణ ఉండదని విమర్శించారు. బీసీ నాయకుడు చంద్రయ్యను వైసీపీ పాలనలో హత్య చేస్తే, ఆయన కుటుంబానికి జరిగిన అన్యాయానికి కూటమి ప్రభుత్వం మేలు చేస్తుంటే వైసీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. దీన్ని బట్టి వైసీపీకి బీసీల పట్ల ప్రేమ ఎంత అనేది అర్థం అవుతోందన్నారు.


జగన్ పాలనలో అన్ని ముఖ్యమైన పదవుల్లో గానీ, అఖరికి పార్టీ పదవుల్లో కూడా అగ్రవర్ణలతో, వారి సంబంధించిన సామాజికవర్గంతో ప్రభుత్వాన్ని నడిపారని విమర్శించారు. వైసీపీ రౌడీల చేతుల్లో, వైసీపీ ఆరాచక శక్తుల చేతుల్లో చంద్రయ్య బలయ్యాడని.. అన్యాయంగా బలైన చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దీనికి వైసీపీలో బీసీలు అని చెప్పుకుంటున్న నాయకులు అందరూ కూడా సమాధానం చెప్పాల్సిందే అని మంత్రి డిమాండ్ చేశారు.


వైసీపీలో బీసీలకు న్యాయం జరిగే పరిస్థితి లేనేలేదన్నారు. గతంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కేవలం నామమాత్రంగా కుర్చీలకు పరిమితం చేశారని మండిపడ్డారు. కొంతమందికి కుర్చీలు కూడా లేకుండా చేసి బీసీ కార్పొరేషన్ చైర్మన్లను అవమానించిన వైసీపీ తీరును ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు సారధ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు సామాజిక గౌరవం పెంచే విధంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏ రాష్ట్రంలో కూడా మద్యం దుకాణాలు బీసీలకు కేటాయించిన దాఖలాలు లేవన్నారు.


కూటమి ప్రభుత్వంలో గౌడ కులస్తులకు మద్యం దుకాణాల్లో 10 శాతం రిజర్వేషన్ కేటాయించడం, బలహీన వర్గాలు ఆర్థికంగా బలపడాలనే కాంక్ష తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఏవిధంగా ఉందో.. కూటమి ప్రభుత్వ ఆలోచన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. బీసీల హక్కులను కాపాడేందుకు త్వరలో ఒక చట్టాన్ని తీసుకొస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

విద్యుత్ ఛార్జీలపై గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి

ప్రజలతో మమేకం అవ్వండి.. నేతలకు సీఎం దిశానిర్దేశం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 30 , 2025 | 03:19 PM