Kollu Ravindra Warn Jogi Ramesh: కారుకూతలు కూస్తే తోలు తీస్తాం.. జోగికి కొల్లు రవీంద్ర వార్న్
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:27 PM
కల్తీ మద్యం అంటూ కుట్రకు తెరలేపిన ఏ ఒక్కరినీ వదలమని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు. కుట్రకు పాల్పడ్డ నిందితులు ఎక్కడ దాక్కున్నా పట్టుకొచ్చి శిక్షిస్తామన్నారు. శవరాజకీయాల్లో ఆరితేరిన జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి, అక్టోబర్ 14: విజయవాడలో మద్యం దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అమలును మంత్రి స్వయంగా పరిశీలించారు. యాప్ ఉపయోగాలపై వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో జోగి రమేష్.. చంద్రబాబు ఇంటికి వచ్చినందుకే వైసీపీ నేతలు డిపాజిట్లు కోల్పోయి పార్టీ అడ్రెస్ గల్లంతైందన్నారు. మళ్లీ చంద్రబాబు ఇంటికొస్తా అంటున్న జోగిరమేష్ కారుకూతలు కూస్తే తోలు తీస్తామని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని జనార్దన్ రావు స్పష్టమైన వాంగ్మూలం ఇచ్చారన్నారు. బందరు పిచ్చోడు పేర్ని నాని రాత్రులు ఆంబోతులా రంకెలు వేసి ఉదయం అదే పోలీసుస్టేషన్‌కు వెళ్లి గడ్డాలు పట్టుకోవటం చూశామన్నారు.
కల్తీ మద్యం అంటూ కుట్రకు తెరలేపిన ఏ ఒక్కరినీ వదలమని వార్నింగ్ ఇచ్చారు. కుట్రకు పాల్పడ్డ నిందితులు ఎక్కడ దాక్కున్నా పట్టుకొచ్చి శిక్షిస్తామన్నారు. శవరాజకీయాల్లో ఆరితేరిన జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై కుట్రలు పన్నుతూ వైసీపీ నకిలీ మద్యం అంటూ ప్రజల్ని భయపెట్టాలని చూస్తోందన్నారు. వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలపై వాస్తవాలు అన్నీ బహిర్గతం చేస్తున్నామని తతెలిపారు. ఇప్పటి వరకూ 19వేల మంది యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని.. ఎక్సైజ్ విధానాన్ని ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం విధ్వంసం చేసిన వ్యవస్థను గాడిలో పెట్టామని.. శాఖాపరంగా ఎవరు తప్పు చేసినా వదిలి పెట్టమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రధాని మద్దతుతోనే సాధ్యం.. గూగుల్‌తో ఒప్పందంపై సీఎం
లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు.. పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్‌లో సోదాలు
Read Latest AP News And Telugu News