Share News

Kesineni Chinni Govt Hospitals: పేదవాడి ఆరోగ్యానికి అండగా ప్రభుత్వం: ఎంపీ కేశినేని

ABN , Publish Date - Oct 14 , 2025 | 02:34 PM

వైద్యులు కొన్ని రిక్వైర్మెంట్స్ అడిగారని.. వాటిని త్వరలోనే వాళ్లకు అందజేస్తామని ఎంపీ వెల్లడించారు. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.

Kesineni Chinni Govt Hospitals: పేదవాడి ఆరోగ్యానికి అండగా ప్రభుత్వం: ఎంపీ కేశినేని
Kesineni Chinni Govt Hospitals

విజయవాడ, అక్టోబర్ 14: గవర్నమెంట్ హాస్పిటల్‌లో అభివృద్ధిపై ఈరోజు (మంగళవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ హాస్పిటల్‌లో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయనే అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని (MP Kesineni Chinni) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్పిటల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించామని.. తాము ఊహించిన దానికన్నా డాక్టర్లు ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారన్నారు. పెద్దపెద్ద హాస్పిటల్స్‌లో అవ్వని ఆపరేషన్స్ ప్రభుత్వ హాస్పిటల్లో చేసి కేసులు సాల్వ్ చేస్తున్నారని తెలిపారు.


వైద్యులు కొన్ని రిక్వైర్మెంట్స్ అడిగారని.. వాటిని త్వరలోనే వాళ్లకు అందజేస్తామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. త్వరలో కన్స్ట్రక్షన్ రెడీ అయిపోతే మరిన్ని అధునాతన పరికరాలతో ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పేదవాడి కోసం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఎంపీ కేశినేని చిన్ని హామీ ఇచ్చారు.


అధునాతన పరికరాలు అందిస్తాం: బోండా ఉమా

ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన రివ్యూ మీటింగ్‌లో డాక్టర్లను అభినందించామని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. అన్ని శాఖలకు సంబంధించిన హెచ్‌ఓడీలు ఈ రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నారన్నారు. డాక్టర్లు రోగులకు మంచి సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రైవేటు హాస్పిటల్లో కూడా చేయలేని కేసులకు ఆపరేషన్ చేసి రోగులను బతికించారని డాక్టర్లను అభినందించారు. మరిన్ని అధునాతన పరికరాలు డాక్టర్లు కోరారని.. వాటిని కూడా సమకూర్చేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. నూతన బిల్డింగ్ సిద్ధం అవ్వగానే మరిన్ని అత్యాధునిక పరికరాలతో ప్రజలకు సేవలు అందిస్తామని ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడించారు.


డాక్టర్లను అభినందించడం సంతోషం: వెంకటేశ్వర్లు

సరైన సమయంలో సరైన వైద్యం అందిస్తున్నందుకు రివ్యూ మీటింగ్‌లో కలెక్టర్, ఎంపీ.. తమను అభినందించారని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్నెంట్ ఏ వెంకటేశ్వర్లు తెలిపారు. డాక్టర్లని అభినందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమకు కావాల్సిన కొన్ని అత్యాధునిక పరికరాలు కోసం కలెక్టర్, ఎంపీకి చెప్పామని.. వాటిని వెంటనే అందిస్తామన్నారని చెప్పారు. తాము అడిగిన ప్రతిపాదనన్నింటికీ కలెక్టర్, ఎంపీ ఒప్పుకున్నారని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్నెంట్ ఏ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2025 | 02:45 PM