Share News

AP liquor scam: మద్యం స్కాంలో కీలక నిందితుడు అరెస్టు..

ABN , Publish Date - May 13 , 2025 | 01:39 PM

AP liquor scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా విచారణకు హాజరుకాకుండా గైర్హాజరయ్యారు. ఎట్టకేలకు మైసూరులో గోవిందప్పను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

AP liquor scam: మద్యం స్కాంలో కీలక నిందితుడు అరెస్టు..
AP liquor scam

అమరావతి: ఏపీ మద్యం కుంభకోణం కేసు (AP liquor scam Cse)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు (Key Accused) గోవిందప్ప బాలాజీ (Govindappa Balaji)ను సిట్ పోలీసులు (SIT Police) అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక (Karnataka)లోని మైసూరు (Mysore)లో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మైసూరు కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసేందుకు సిట్ బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి. గోవిందప్ప బాలాజీ భారతి సిమెంట్స్ డైరెక్టర్. కాగా సుప్రీమ్ కోర్టులో మంగళవారం గోవిందప్ప బాలాజీ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరగనుంది.


మూడు రోజుల క్రితమే నోటీసులు..

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్పలకు మూడు రోజుల క్రితం విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే నిందితులు ఇంత వరకు సిట్ కార్యాలయానికి చేరుకోలేదు. ఇప్పటికే వారి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు సైతం అరెస్టు నుంచి వీరికి మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

Also Read: ముంబై బాంబు పేలుళ్ల బెదిరింపులు..


ఈ ముగ్గురు కీలక నిందితులు..

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33 గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు. ఇటీవల అరెస్ట్ అయిన కసిరెడ్టి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్ట్‌లో కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల వద్దకు చేరాయని విచారణలో నిందితులు పేర్కొన్నారు. ఈ రిమాండ్ రిపోర్టు ఆధారంగానే వాళ్ల పేర్లు చేర్చినట్లు మెమోలో సెట్ అధికారులు పేర్కొన్నారు.

జగన్‌కు అత్యంత సన్నిహితులు..

కాగా వైఎస్ జగన్‌కు బాలాజీ గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అత్యంత సన్నిహితులు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పలతో పాటు ధనుంజయరెడ్డి పాత్ర కీలకం. ముడుపులుగా ఎంత మొత్తం చెల్లించాలనేదానిపై ఈ ముగ్గురూ తరచూ హైదరాబాద్, తాడేపల్లిలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో సమావేశమయ్యేవారని సిట్‌ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రియుడితో ఇంట్లో భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

అండమాన్‌లోకి నైరుతి రుతుపవనాలు..

For More AP News and Telugu News

Updated Date - May 13 , 2025 | 01:39 PM