Nimmala Ramanaidu: రైతులు కన్నీరు పెట్టినా కనికరించలేదు.. జగన్‌పై నిమ్మల ఫైర్
ABN , Publish Date - Jan 27 , 2025 | 04:05 PM
Nimmala Ramanaidu: పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేసి 2025 జులైకు ఉత్తరాంధ్రకు నీరు ఇవ్వనున్నారని మంత్రి నిమ్మల తెలిపారు. రూ.1050 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులకు అన్ని అనుమతులు ఇప్పించారన్నారు. బాటిల్ నెక్‌పై సమీక్ష చేసి పురుషోత్తం పట్నం మీదుగా ఉత్తరాంధ్రకు నీరు ఇస్తామని.. దీని పై అధికారులతో సమీక్ష చేసి పలు సూచనలు చేశామన్నారు.
విజయవాడ, జనవరి 27: గత ఐదేళ్లల్లో విధ్వంసకరమైన పాలన సాగిందని.. ఇరిగేషన్ శాఖలో అనేక కీలక ప్రాజెక్టు ల పనులు నిలిపివేశారని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నీరు అందక రైతులు కన్నీరు పెట్టినా జగన్ ప్రభుత్వం కనికరం చూపలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం ఆధ్వర్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు చేపట్టామని తెలిపారు. పోలవరం నిర్మాణ పనులు మొత్తం ఆపివేస్తే.. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ ఊపిరి పోశారన్నారు. పోలవరం లెఫ్ట్ కెనాల్‌ను ఇటీవల చంద్రబాబు సందర్శించారని.. ఉత్తరాంధ్ర, రాయలసీమకు నీరు ఇవ్వాలని చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు.
టైం బాండ్ పెట్టుకుని మరీ...
ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా కొంతవరకైనా నీరు ఇచ్చేలా పనులు చేస్తున్నారన్నారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేసి 2025 జులైకు ఉత్తరాంధ్రకు నీరు ఇవ్వనున్నారని తెలిపారు. రూ.1050 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులకు అన్ని అనుమతులు ఇప్పించారన్నారు. బాటిల్ నెక్‌పై సమీక్ష చేసి పురుషోత్తం పట్నం మీదుగా ఉత్తరాంధ్రకు నీరు ఇస్తామని.. దీనిపై అధికారులతో సమీక్ష చేసి పలు సూచనలు చేశామన్నారు. గత వైసీపీ పాలనలో పార మట్టి, కట్ట సిమెంట్ కూడా వేయలేదని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలకు అన్ని విధాలా అన్యాయం చేసిన ఘనుడు జగన్‌మోహన్ రెడ్డి అంటూ విరుచుకుపడ్డారు. నిర్ణీత టైం బాండ్ పెట్టుకుని మరీ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇంకా పోలవరం గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు సారధ్యంలో డయా ఫ్రం వాల్ నిర్మాణం చేస్తే.. జగన్ జమానాలో అదే డయా ఫ్రం వాల్ కొట్టుకుపోయేలా చేశారన్నారు. అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టు గురించి అడిగితే వైసీపీ నేతలు చెప్పకుండా పారిపోయారని వ్యాఖ్యలు చేశారు.
House For All: అందరికీ ఇళ్లు పథకం గైడ్‌లైన్స్.. మీరు అర్హులో కాదో చెక్ చేసుకోండి
కుర్చీ కోసం రాజకీయ డ్రామాలు..
జగన్ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయన్నారు. కుర్చీ కోసం జగన్ రాజకీయ డ్రామాలు ఆడారన్నారు. 2019-24 మధ్య ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం చేశారని ప్రశ్నించారు. పోలవరం రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్‌లో నీరు ఉంటేనే రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఏపీ చరిత్రలో సీఎంగా జగన్ చేసినంత దగా ఎవరూ చేయలేదన్నారు. ఈ యేడాది డిసెంబరు నాటికి డయా ప్రం వాల్ పూర్తి చేస్తామని వెల్లడించారు. 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు సాగు, తాగు నీరు ఇస్తామన్నారు. చింతలపూడి ప్రాజెక్టును కూడా అటకెక్కించారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల, నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడిందన్నారు. ఇప్పుడు ఉన్న అడ్డంకులను అధిగమించి పనులు పూర్తి చేస్తామన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేస్తున్నామని చెప్పారు. కృష్ణా, గోదావరి నదులకు ద్రోహం, దగా చేసిన వ్యక్తి జగన్ అంటూ విరుచుకుపడ్డారు. విభజన చట్టం ప్రకారం మనకు నీరు, ప్రాజెక్టుల వాడకంపై ఒప్పందం జరిగిందని తెలిపారు.
ఆచితూచి నిధులు...
జగన్ ప్రభుత్వంలో 2023 సంవత్సరంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రం నుంచి వచ్చిన సూచనలను పట్టించుకోలేదన్నారు. జగన్ తన కేసుల కోసం తెలుగు ప్రజలు భవిష్యత్తును తాకట్టు పెట్టారన్నారు. ప్రజల హక్కులను హరించే విధంగా జగన్ వ్యవహరించారన్నారు. విభజన చట్టం ప్రకారం నిధులు, నియామకాలు ఉన్నా జగన్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో తప్పకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. 14 లక్షల కోట్లు అప్పులు పెట్టి గత పాలకులు వెళ్లారని.. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెడతామన్నారు. అన్నీ పూర్తి చేయాలని ఉన్నా ఆర్ధిక ఇబ్బందులు ప్రభుత్వానికి ఉన్నాయని తెలిపారు. 2014-2019 మధ్య అభివృద్ధికి నిధులు సీఎం చంద్రబాబు వెంటనే ఇచ్చేవారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల ఇప్పుడు ఆచితూచి చంద్రబాబు నిధులు విడుదల చేస్తున్నారని తెలిపారు. ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని సరిచేయడానికి కొంత సమయం పడుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ట్రంప్ సంచలన నిర్ణయం.. ఈ దేశాలకు సహాయం బంద్
సాయంత్రం 4 గంటలకు ఎండీకి సమ్మె నోటీసు..
Read Latest AP News And Telugu News