Share News

Flights Cancelled: గన్నవరం నుంచి బయలుదేరే పలు విమానాలు రద్దు

ABN , Publish Date - Oct 27 , 2025 | 08:43 PM

గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరే పలు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు విమానయాన సంస్థకు చెందిన ఉన్నతాధికారులు వెల్లడించారు.

Flights Cancelled: గన్నవరం నుంచి బయలుదేరే పలు విమానాలు రద్దు

విజయవాడ, అక్టోబర్ 27: మొంథా తుపాన్ కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే విజయవాడ నగరంలో రేపు అంటే మంగళవారం అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడగించింది. ఈ నేపథ్యంలో మంగళవారం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేర వలసిన పలు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ మేరకు గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ యం. లక్ష్మీకాంతరెడ్డి సోమవారం వెల్లడించారు.


వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, షార్జా వెళ్లి వచ్చే 8 సర్వీసులను రద్దు చేసినట్లు వివరించారు. రేపు ఉదయం 10:00 గంటల తర్వాత ఇండిగో విమానం సర్వీసులను సైతం నిలిపివేసే అవకాశం ఉందన్నారు. అయితే ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం సర్వీసు మాత్రం యథావిధిగా నడుస్తుందని స్పష్టం చేశారు. ఇక బయలుదేరే ముందు ఎయిర్‌లైన్స్ వాళ్లతో సంప్రదించి.. ఆ తర్వాత విమానాశ్రయానికి రావాలని ప్రయాణికులకు ఆయన సూచించారు.


రద్దయిన విమాన సర్వీసులు వివరములు...

  • IX 2819 వైజాగ్- గన్నవరం

  • IX-2862 గన్నవరం - హైదరాబాద్

  • I X-2875 బెంగళూరు- గన్నవరం

  • I X-2876 గన్నవరం - బెంగళూరు

  • IX-976 షార్జా - గన్నవరం

  • IX-975 గన్నవరం -షార్జా

  • IX2743 హైదరాబాద్ - గన్నవరం

  • I X-2743 గన్నవరం - వైజాగ్


ఈ వార్తలు కూడా చదవండి..

కట్టింగ్ మాస్టర్‌గా మారిన సీఎం రేవంత్ రెడ్డి

రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన

For More AP News And Telugu News

Updated Date - Oct 27 , 2025 | 08:45 PM