Jagan Reaction on Budget: బడ్జెట్‌పై జగన్ రియాక్షన్..
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:09 PM
Jagan on Budget: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ సీఎం జగన్ స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. రెండు బడ్జెట్‌లలోనూ ప్రజలను మోసం చేశారంటూ వ్యాఖ్యలు చేశారు.

తాడేపల్లి, మార్చి 5: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల (AP Assembly Budget Session) తొలిరోజు అసెంబ్లీకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Former CM YS Jagan) ఆ తరువాత సభ గడప తొక్కలేదు. ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం (AP Govt) బడ్జెట్‌ను (Budget 2025-26) ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో బడ్జెట్‌పై అసెంబ్లీలో మాట్లాడాల్సిన జగన్.. ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. అంతే కాకుండా బడ్జెట్‌లో ప్రజలను మోసం చేశారని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఎప్పటిలాగానే సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. బడ్జెట్‌లో అంతా అరకొరగానే కేటాయింపులు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇంకా ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.
బుధవారం మీడియాతో జగన్ మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీ నుంచి రాష్ట్ర బడ్జెట్‌పై మాట్లాడే పరిస్థితి లేదని వైఎస్ జగన్ అన్నారు. నాణేనికి ఇంకో వైపు కూడా ప్రజలకు తెలియాలన్నారు. చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) రెండు బడ్జెట్‌లలో అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసిన వైనం కనిపిస్తోందన్నారు. బాబు షూరిటి మోసం గ్యారంటీ అంటూ వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌లో అంతా పరనింద ఆత్మస్తుతి కనిపిస్తోందన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు అరకొరే ఉన్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సూపర్ 6 హామీలు ఎన్నికల సమయంలో కర పత్రాలు బాండ్లు ఇంటింటికీ పంచారని తెలిపారు. గవర్నర్ ప్రసంగం పేరుతో అబద్దాలు చెప్పారన్నారు. మహిళలకు ఉచిత బస్సు హామీ నెరవేర్చలేదన్నారు. ఉచిత బస్సు కోసం మహిళలు ఎదురు చూపులు చూస్తున్నారని తెలిపారు. సూపర్ సిక్స్, సూపర్ సెవర్ అన్నారని.. నిరుద్యోగ భృతి కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని తెలిపారు. నిరుద్యోగ యువతకు నెలకు 3 వేల హామీ ఏమైందని అన్నారు.
Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
నిరుద్యోగులను ఈ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. 4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చామనిని గవర్నర్ ప్రసంగంలో చెప్పించారన్నారు. ఈ బడ్జెట్‌లో నిరుద్యోగులకు 36 వేలు ఇవ్వకుండా ఎగనామం పెట్టారని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని చంద్రబాబు ఎగ్గొట్టారన్నారు. వైసీపీ పాలనలో నాలుగు నెలల కాలంలో లక్షా 30 వేల ఉద్యోగాలు గ్రామ వార్డ్ సచివాలయంలో కల్పించామని చెప్పుకొచ్చారు. 2.66 లక్షలు ఉద్యోగాలు వాలంటరీలుగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అక్షరాల అయిదేళ్ళ కాలంలో 6.31 లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని జగన్ పేర్కొన్నారు.
చిన్న హామీలను కూడా...
2019-24 కాలంలో ఎంఎస్‌ఎమ్ఈ ద్వారా 32 లక్షలు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇదే విషయం చంద్రబాబు తన సోషల్ ఏకనిమిక్ సర్వేలో పేర్కొన్నారని తెలిపారు. చంద్రబాబు హయాంలో పరిశ్రమలు పెట్టే వారిని భయపెడుతున్నారని.. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళకు ఏడాదికి 18 వేలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కోటి 80 లక్షల మంది మహిళలకు ఈ బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించలేదని.. ఒక్కో మహిళకు చంద్రబాబు 36 వేలు బకాయి పడ్డారన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం హామీ నెరవేర్చలేదన్నారు. మహిళలు అంతా ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇటువంటి చిన్న హామీ కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. తల్లికి వందనం అనే పథకం పేరు పెట్టి మొదటి బడ్జెట్‌లో ఒక్క రూపాయి ఇవ్వలేదని.. రెండో బడ్జెట్‌లో కూడా తల్లికి వందనం పథకానికి గ్రాంట్స్‌లో రూ.8278 కోట్లు కేటాయించారని తెలిపారు. యూడీఐఎస్‌ఈ రిపోర్ట్ ప్రకారం ఏపీలో 87 లక్షలు 41 వేల 885 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. దీని ప్రకారం తల్లికి వందనం పథకానికి రూ.13,112 వేల కోట్లు అవసరమన్నారు. ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు రూ.30 వేలు ఎగనామం పెడుతున్నారని వ్యాఖ్యలు చేశారు.
బాబు బాకాయి పడ్డారు...
రైతులకు కూడా ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. పీఎం కిసాన్ కాకుండా రైతులకు 20 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని.. రాష్ట్రంలోని 53,58,266 మంది రైతులకు రూ.10,717 కోట్లు కేటాయించాలని చెప్పారు. రైతులకు చంద్రబాబు మోసం చేయడం కొత్త కాదన్నారు.గతంలో వ్యవసాయ రుణాలు మాఫీ రూ.87 వేల కోట్ల హామీ ఇచ్చి నేరవేర్చలేదన్నారు. దీపం పథకం పేరుతో మహిళలను చంద్రబాబు మోసం చేశారంటూ విమర్శించారు. కోటి 59 లక్షలు మంది రాష్ట్రంలో లబ్దిదారుల ఉన్నారన్నారు. ఏడాదికి రూ.4 వేల కోట్లు అవసరమని.... దీనికి ఎగనామం పెట్టారన్నారు. మొదటి సంవత్సరం మూడు సిలిండర్ల స్థానంలో ఒకటే ఉచితంగా ఇచ్చారని తెలిపారు. 50 ఏళ్లకే పెన్షన్ అని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. 20 లక్షల కుటుంబాలకు 4 వేలు ఇవ్వాల్సి వస్తుందిని ఎగ్గొట్టారని మండిపడ్డారు. దీనికి 9 వేలా 600 కోట్లు అయితే బడ్జెట్‌లో ఏమీ ఇవ్వలేదన్నారు. మహిళలకు మరో 90 వేలు చంద్రబాబు బకాయి పడ్డారని తెలిపారు.
వైసీపీ వాళ్లకు ఇవ్వకుండా...
సూపర్ సిక్స్ పథకాలకు మొత్తం రూ.79,867 కోట్లు అవసరమని.. మొదటి బడ్జెట్‌లో ఇందుకు రూ.7280 కోట్లు కేటాయించి రూ.865 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. వైసీపీ వాళ్ళకు ఏ పథకాలు ఇవ్వొద్దని చంద్రబాబు ప్రకటిస్తున్నారన్నారు. ఈ మాట అనడానికి చంద్రబాబు ఎవరన్నారు. పక్షపాతానికి, రాగ ద్వేషాలకు అతీతంగా పని చేస్తానని హామీ ఇచ్చి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని.. ఇలాంటి వ్యక్తిని సీఎంగా ఒక్క నిమిషం కొనసాగించకూడదు అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
Chandrababu : వైసీపీ ఆటలు సాగనివ్వను
Karimnagar: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో.. బీజేపీ ముందంజ
Read Latest AP News And Telugu News