Share News

Durga Temple Protocol Issue: తొలిరోజే ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ వివాదం..

ABN , Publish Date - Oct 11 , 2025 | 01:32 PM

ప్రెస్ మీట్ ఉందని తనకు ఎందుకు చెప్పలేదని సిబ్బందిపై ఈవో శీనా నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరే ప్రెస్ మీట్ నిర్వహించుకోండి అంటూ వెళ్లిపోయారు.

Durga Temple Protocol Issue: తొలిరోజే ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ వివాదం..
Durga Temple Protocol Issue

విజయవాడ, అక్టోబర్ 11: దుర్గగుడి ఛైర్మన్, పాలక మండలి సభ్యులు ఈరోజు (శనివారం) ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తొలిరోజే ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత నూతన ఛైర్మన్ రాధాకృష్ణ (గాంధీ) (Durgamma Temple Chairman Radhakrishna) మీడియా సమావేశం నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఛైర్మన్‌తో సహా కొందరు సభ్యుల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అదే సమయంలో మీడియా సమావేశ ప్రదేశానికి ఈఓ శీనా నాయక్ (EO Seena Naik) వచ్చారు. ప్రెస్ మీట్ ఉందని తనకు ఎందుకు చెప్పలేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరే ప్రెస్ మీట్ నిర్వహించుకోండి అంటూ ఈవో వెళ్లిపోయారు.


అయితే ఈవో లేకుండానే ప్రెస్ మీట్ ప్రారంభించేందుకు ఛైర్మన్ గాంధీ సిద్ధమయ్యారు. కానీ.. ఈవో సీరియస్‌గా వెళ్ళిపోయిన విషయాన్ని సిబ్బంది.. ఛైర్మన్‌ గాంధీకి చెప్పడంతో 10 నిమిషాల పాటు ఈవో కోసం ఎదురుచూశారు. ఛైర్మన్ ఎదురు చూస్తున్న విషయాన్ని ఈవోకు సిబ్బంది చెప్పడంతో ఆలస్యంగా ప్రెస్ మీట్‌కు హాజరయ్యారు. దీనిపై ఛైర్మన్ వివరణ ఇస్తూ.. ఈవోకు మీటింగ్ గురించి తెలుసేమో అని అనుకున్నట్లు తెలిపారు. అయితే ప్రెస్‌మీట్‌పై తనకు సమాచారం లేకపోవడంపై మీడియా అడిగిన ప్రశ్నకు.. ‘వదిలేయండి’ అంటూ ఈవో శీనా నాయక్. సమాధానం ఇచ్చారు.


కాగా.. దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రాజగోపురం ముందు ఈవో శీనా నాయక్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 17 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటు అయ్యింది. బీజేపీ నుంచి ఇద్దరు, జనసేన నుంచి ఒకరు, మిగిలిన 14 మంది టీడీపీ నుంచి పాలకమండలి సభ్యులుగా ఉన్నారు.


ఇవి కూడా చదవండి...

అర్ధరాత్రి గజరాజుల బీభత్సం..

కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 11 , 2025 | 01:53 PM