Share News

Pawan Kalyan: ఆ సమస్య నన్ను వదలట్లేదు.. ఇప్పుడూ అదే బాధ.. జాతీయ మీడియాతో పవన్

ABN , Publish Date - Feb 20 , 2025 | 04:40 PM

Pawan Kalyan: ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా హస్తినకు వెళ్లిన పవన్.. అక్కడి జాతీయ మీడియాతో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ సమావేశాలకు ఎందుకు దూరంగా ఉన్నారనే విషయాన్ని బయటపెట్టారు ఉపముఖ్యమంత్రి.

Pawan Kalyan: ఆ సమస్య నన్ను వదలట్లేదు.. ఇప్పుడూ అదే బాధ.. జాతీయ మీడియాతో పవన్
Deputy CM Pawan Kalyan

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఏపీలో సమన్వయంతోనే కలిసి ముందుకు వెళుతున్నామని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత ఎన్డీఏ నేతలందరికీ విందును ఏర్పాటు చేశారు. విందుకు హాజరై బయటకు వస్తున్న సమయంలో పవన్‌తో జాతీయ మీడియా కాసేపు చిట్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏపీలో తాజా పరిస్థితులపై మీడియా అడిగిన ప్రశ్నలకు పవన్ సమాధానం ఇచ్చారు. వెన్ను నొప్పి కారణంగానే ఏపీలో కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయానని.. ఇప్పటికీ వెన్న నొప్పి తీవ్రంగా బాధిస్తోందని తెలిపారు.


ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. అలాగే జగన్ ప్రభుత్వంపైనా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ఆ కారణంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. తనకు కేటాయించిన శాఖలపైన ఉపముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పర్యావరణ, అటవీ శాఖలు నాకు చాలా ఇష్టమైన శాఖలు. నిబద్ధతతో నా మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నా ’’ అని జాతీయ మీడియాతో పవన్ వెల్లడించారు.

Vamshi Case: వంశీ కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. కోర్టు ఏం చెప్పిందంటే


సరదా సంభాషణ..

modi-pawan.jpg

ఇదిలా ఉండగా.. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారమహోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), పవన్ కళ్యాణ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రమాణస్వీకార వేదిక వద్దకు వచ్చిన సమయంలో పవన్ దీక్షా వస్త్రాలు ధరించి ఉండటంతో మోదీ సరదాగా సంభాషించారు. హిమాలయాలకు వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా అని పవన్‌ను ప్రధాని అడగగా.. హిమాలయాలకు వెళ్లేందుకు ఇంకా సమయం ఉందని బదులిచ్చారు పవన్. ఇదే విషయాన్ని జాతీయ మీడియా కూడా ప్రశ్నించగా.. మోదీకి తనకు మధ్య ఏం జరిగిందనే విషయాన్ని తెలియజేశారు ఉపముఖ్యమంత్రి.


ఇవి కూడా చదవండి...

Robbery: హైటెక్ చోరీ.. ఖంగుతిన్న పోలీసులు

జగన్‌ భద్రతపై వైసీపీ వ్యాఖ్యలు.. టీడీపీ స్ట్రాంగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 20 , 2025 | 05:27 PM