CM Chandrababu: పొట్టి శ్రీరాములు త్యాగం అందరికీ స్పూర్తి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:19 AM
మహాత్మా గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ధీరోదాత్తుడు పొట్టిశ్రీరాములు అని సీఎం చంద్రబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సీఎం నివాళులర్పించారు.
అమరావతి, డిసెంబర్ 15: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) నివాళులర్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సీఎం స్పందిస్తూ.. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే దృఢ నిశ్చయంతో పోరాడిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రత్యేక రాష్ట్రం పోరాడారని అన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న ధీరోదాత్తుడు పొట్టి శ్రీరాములు అని సీఎం తెలిపారు. ఆ మహనీయుడు ప్రాణ త్యాగ ఫలమే ఈ రోజు మనకున్న భాషాప్రయుక్త రాష్ట్రాలు అని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.
చంద్రబాబు ట్వీట్..
‘అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తున్నాను. మహాత్మా గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ధీరోదాత్తుడు ఆయన. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే దృఢ నిశ్చయంతో పోరాడి లక్ష్యం సాధించిన మహనీయుడు ఆయన. తన ప్రాణాలను కూడా లెక్కచేయని ఆయన త్యాగం మనలో స్ఫూర్తి నింపాలి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తన ప్రాణత్యాగంతో నాంది పలికిన ఆ మహనీయునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మరొక్కమారు నివాళి అర్పిస్తున్నాను’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
ఆ మహనీయుని ప్రాణ త్యాగ ఫలమే: డిప్యూటీ సీఎం పవన్

తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే సంకల్పంతో దీక్ష చేపట్టి ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా అమరజీవికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. ఆ మహనీయుని ప్రాణ త్యాగ ఫలమే ఈ రోజు మనకున్న భాషాప్రయుక్త రాష్ట్రాలని తెలిపారు. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచి సమసమాజ స్థాపన కోసం తపించారని తెలిపారు. గాంధీజీతో పొట్టి శ్రీరాములుకు ఉన్న అనుబంధాన్ని ఆంధ్ర ఉద్యమం గురించి ప్రచురితమైన అధ్యయన పత్రాల్లో పేర్కొన్నారని చెప్పారు. లక్ష్య సాధన కోసం అమరజీవి చేసిన దీక్షను భావితరాలు తెలుసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
నాలుగవ రోజు ప్రభాకర్ రావు కస్టడీ విచారణ.. ఆ సమాచారంపైనే సిట్ ఫోకస్
పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం: మంత్రి టీజీ భరత్
Read Latest AP News And Telugu News