Share News

Chandrababu Criticizes Jagan: జగన్ బాగోతం బయటపెట్టిన చంద్రబాబు

ABN , Publish Date - Mar 12 , 2025 | 01:32 PM

Chandrababu Criticizes Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకూ ఇదే సభలో ముఖ్యమంత్రిగా ఉన్నారని విమర్శలు గుప్పించారు.

Chandrababu Criticizes Jagan: జగన్ బాగోతం బయటపెట్టిన చంద్రబాబు
Chandrababu Criticizes Jagan

అమరావతి, మార్చి 12: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) కొనసాగుతున్నాయి. శాసనసభలో మహిళా సాధికారితపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) మాట్లాడుతూ.. ఓవైపు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సమయంలోనే మహిళల పట్ల వివక్షత చూపడం జరుగుతోందన్నారు. ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పటి నుంచి ఉమెన్ ఎంపవర్‌మెంట్‌కు కృషి చేశారని గుర్తుచేశారు. మహిళా సాధికారిత కోసం నిన్న, నేడు, రేపు టీడీపీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ సిద్దాంతం జండర్ ఈక్విటీ ద్వారా ఆడవారికి సమాన అవకాశాలు కల్పించడమని తెలిపారు.


మహిళా సాధికారిత ప్రారంభం అయ్యింది టీడీపీతోనే అని చెప్పుకొచ్చారు. 1986లో మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు ఇచ్చారన్నారు. తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకూ ఇదే సభలో ముఖ్యమంత్రిగా ఉన్నారని మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి సీఎం విమర్శలు గుప్పించారు. ఇచ్చిన ఆస్తి విషయంలోనూ కోర్టుకు వెళ్లి వెనెక్కి ఇవ్వాలని అడిగారంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

AP Legislative Council: సభ మొదలవగానే షూరూ చేసిన వైసీపీ..


ఇది సజీవ సాక్ష్యం..

మహిళా విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చామన్నారు. 1995లో మహిళా ఎంపవర్‌మెంట్ కోసం ఆలోచిస్తూ డ్వాక్రా ఉమెన్ ద్వారా ఎంపవర్ చేయాలని నిర్ణయించామన్నారు. విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని తెలిపారు. దీని వల్ల ఆడబిడ్డలు చదువుకున్నారని... వారు కూడా పనిచేయడం ప్రారంభించారన్నారు. సూర్యకుమారి ఐఏఎస్... ఆమె 1996లో గ్రూప్ వన్ ఆఫీసర్‌గా సెలెక్ట్ అయ్యి ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖా సెక్రెటరీగా పనిచేస్తున్నారన్నారు. ఆరోజు బెనిఫిషరీ ఈరోజు వారి కోసం పాలసీలు రూపొందిస్తున్నారని.. ఇది సజీవ సాక్ష్యమని చెప్పుకొచ్చారు. పుట్టిన అమ్మాయి భారం కాదు ఇంటికి మహలక్ష్మి అన్నామని... వారి పేరుతో ఓ 5వేలు డిపాజిట్ చేయించామని తెలిపారు. మగపిల్లలు, ఆడపిల్లలకు తేడాలేదని ఆడపిల్లలకు సైకిళ్లు కొనిచ్చినట్లు చెప్పారు.


ఆడ కండక్టర్‌లు.. శభాష్..

స్పీకర్‌గా ప్రతిభా భారతికి అవకాశం ఇచ్చామన్నారు. 8 శాతంతో ప్రారంభమైన రాజకీయ రిజర్వేషన్లు స్ధానిక సంస్ధలలో 33 శాతం అయ్యిందన్నారు. ఆడవాళ్లు మగవాళ్ళకంటే తెలివైన వారని.. ఈ విషయం చాట్ జీపీటీని అడిగినా చెపుతుందన్నారు. అమెరికా లాంటి దేశంలో కూడా మహిళల్లో సమానత్వం లేదన్నారు. ఆర్టీసీలో ఆడ కండెక్టర్‌లు చాలా బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. 65 లక్షల గ్యాస్ కనెక్షన్‌లు ఆడబిడ్డలకు ఇప్పించామన్నారు. దీపం 2 కింద మూడు సిలెండర్‌లు ఇస్తున్నామని.. డ్వాక్రా సంఘాలు లేని ఊరూ లేదు, ఇల్లు లేదన్నారు. 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తామని మహిళల అండ ఉందనే ప్రకటించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


అమరావతి మహిళల ఉద్యమంపై..

అయిదు సంవత్సరాలు అమరావతి మహిళలు ఎంత విరోచితంగా పోరాడారని... వారు చేసిన తప్పేంటి అని అన్నారు. అమరావతి రాజధాని కోసం 29 వేల మంది రైతులు 30 వేల ఎకరాల భూమి రాజధాని కట్టుకోవడానికి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారన్నారు. వాలంట్రీగా వచ్చి భూములు ఇచ్చారని.. డెవలెప్మెంట్ చేశాక తిరిగి ప్లాట్‌లు ఇస్తామన్నామని తెలిపారు. ఎక్కడా జరగని ఇలాంటి గొప్ప ప్రయోగం చేస్తే మూడు రాజధానులు అని మూడు ముక్కలు ఆట ఆడారని మండిపడ్డారు. ఇదే అసెంబ్లీలో సమావేశాలు పెట్టి ఈ అసెంబ్లీకి భూమి ఇచ్చిన వ్యక్తులను హింసించారన్నారు. ఇదెక్కడి న్యాయం వాళ్ల భూమి మీద మనం కుర్చున్నామని.. వాళ్ల భూమి మీద మనం పరిపాలిస్తున్నామన్నారు. అయిదే సంవత్సరాలు వారు వీర వనితల్లా పోరాడారని కొనియాడారు. వారి ఇళ్లపై, బాత్ రూంలపై డ్రోన్‌లు ఎగరేస్తే అప్పటి పాలకులను ఏమనాలంటూ ఫైర్ అయ్యారు. న్యాయస్ధానం టూ దేవస్ధానం పాదయాత్ర చేస్తే వారికి భోజనం చేయడానికి హాలు ఇవ్వకుండా చేస్తే రోడ్డుపై భోజనాలు చేశారన్నారు. మహిళలు చూపిన చొరవవల్లే అమారావతి బ్రతికిందన్నారు. నేడు మరలా ఇక్కడ వారి త్యాగం మూలంగానే సమావేశాలు పెట్టుకోగలుగుతున్నామని.. అమరావతి చరిత్రలో వారి త్యాగం నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

AP Legislative Council: సభ మొదలవగానే షూరూ చేసిన వైసీపీ..

Chevireddy Bhaskar Reddy notices: వైసీపీ నేత చెవిరెడ్డికి నోటీసులు.. ఏ విషయంలో అంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 12 , 2025 | 01:45 PM