Crime News: మోటార్ బైక్‌లకు జీపీఎస్ ఏర్పాటు చేసుకోండి: సీపీ
ABN , Publish Date - May 28 , 2025 | 12:30 PM
Crime News: సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల చాలా వరకు దొంగతనాలు అరికట్టామని, ఈ ఏడాదిలో 365 చోరీలు జరగ్గా, వాటిలో 185 మోటార్ బైక్‌లు చోరీలు ఉన్నాయని, వాటిపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. మోటార్ సైకిళ్లకు జీపీఎస్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.
Crime News: చైన్ స్నాచింగ్ (Chain Snatching)లకు పాల్పడుతున్న ముఠా (Gang)ను విజయవాడ (Vijayawada) పోలీసులు (Police) పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 30 లక్షలు విలు చేసే 476 గ్రామల బంగారు ఆభరణాలు స్వాధీనం (Rs 30 Lakhs Seized) చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు (Four Arrested) చేశారు. ఈ సందర్భంగా విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లాకు చెందిన అచ్చి గిరిబాబు, అతని సోదరుడు అచ్చి మహేష్, వెంకటరమణ, మొగలి సంధ్యాలను అరెస్టు చేశామని చెప్పారు. 25 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారని, నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు అన్ని చోట్లా ఏర్పాటు చేశామని తెలిపారు.
రూ. లక్ష బైక్‌కు రూ. 2,500 ఖర్చు పెట్టలేరా..
సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల చాలా వరకు దొంగతనాలు అరికట్టామని, ఈ ఏడాదిలో 365 చోరీలు జరగ్గా, వాటిలో 185 మోటార్ బైక్‌లు చోరీలు ఉన్నాయని, వాటిపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. మోటార్ సైకిళ్లకు జీపీఎస్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. రూ. 2500 ఖర్చు అయినా... వాహనం పొయే అవకాశం ఉండదని ఆయన అన్నారు. లక్ష రూపాయల బైక్ కోసం రూ. 2500 ఖర్చు పెడితే మంచిదని, బస్టాండులో ఇటీవల బైక్‌ల చోరీ బాగా జరిగేవని, కృష్ణలంక పోలీసులు దీనిపై దృష్టి పెట్టడంతో చోరీలు తగ్గించ కలిగామన్నారు.
చైన్ స్నాచింగ్‌లు చాలా తగ్గు ముఖం పట్టాయి..
చైన్ స్నాచింగ్‌లు చాలా వరకు తగ్గు ముఖం పట్టాయని, చైన్ స్నాచింగ్ ముఠాను పట్టుకున్న అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్నానని సీపీ రాజశేఖర్ బాబు చెప్పారు. ఈ ముఠా చాలా నేరాలు చేయడమే కాకుండా... పోలీసులు, ప్రజలపై దాడులు చేసిన ఘటనలూ ఉన్నాయన్నారు. చైన్ స్నాచింగ్ అంటే.. ఒక విధంగా పోలీసులకు సవాల్ విసరడమేనని అన్నారు. మధ్యతరగతి ప్రజలే చైన్ స్నాచింగ్ ముఠాకు బాధితులుగా మారుతున్నారని, ఒక్కోసారి వారి జీవితాలు తారుమారు అవుతున్నాయని అన్నారు. ఈ తరహా నేరాల నియంత్రణకు ఇంకా తీవ్రంగా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Also Read: కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విచారిస్తున్న ఈడీ
ఇలాంటి నేరస్థులపై కఠిన చర్యలు..
బైక్‌లు దొంగిలించి ఒడిషాకు వెళ్లి... అక్కడి నుంచి గంజాయి రవాణా తెస్తున్నారని, దీని వల్ల ఒక్కోసారి అమాయకులు బలి అయ్యే ప్రమాదం ఉందని సీపీ రాజశేఖర్ బాబు అన్నారు. ఇటువంటి నేరస్థులపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ఈ తరహా బైక్ చోరీలు, గంజాయి రవాణా చేసే వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. దొంగ డాక్యుమెంట్లు పెట్టి బైక్‌లు అమ్మేస్తున్నారని, గంజాయి కేసులు ఉంటే వెంటనే జైలుకు పంపిస్తున్నామని చెప్పారు. కొంత వరకు తగ్గినా... ఒడిషా వైపు నుంచే ఇంకా రవాణా అవుతుందన్నారు. ఇక్కడ బైక్‌ల దొంగతనం నిరోధిస్తే... గంజాయి అక్రమ రవాణా తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే సెల్ ఫోన్ దొంగతనాలపై దృష్టి పెట్టి తగ్గించకలిగామన్నారు. దొంగల జాబితాను కూడా తయారు చేసి ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నామని, సెల్ ఫోన్,మోటార్ బైక్‌ల చోరీలను మరింత నియంత్రించేలా చర్యలు ఉంటాయని సీపీ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ అధ్యక్షునిగా చంద్రబాబు పేరు ప్రకటన
ఎన్టీఆర్‌కు సీఎం చంద్రబాబు ఘనంగా నివాళి
For More AP News and Telugu News