ఎన్టీఆర్‌‌కు సీఎం చంద్రబాబు ఘనంగా నివాళి

ABN, Publish Date - May 28 , 2025 | 10:57 AM

CM Chandrababu: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత స్వర్గీయ ఎన్టీ రామారావు 102వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ‘సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు’ అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పిన దార్శనికుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.

CM Chandrababu: దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు (NTR) 102వ జయంతి (102nd Birth Anniversary) సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు (Tribute). ఈ సందర్బంగా ఆయన తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు, ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనే మూడు అవసరాలను తీర్చడమే తన జీవితాశయంగా భావించిన ధీరోదాత్తుడు అన్న ఎన్టీఆర్ అని అన్నారు.

Also Read: టీడీపీ చీఫ్‌గా చంద్రబాబు 30 ఏళ్లు పూర్తి


‘సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు’ అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పిన దార్శనికుడు ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. అన్నగా ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇచ్చినా, మండల వ్యవస్థతో పాలనారంగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లినా, పక్కా ఇళ్ల నిర్మాణంతో పేదలకు అండగా నిలిచినా, కిలో రెండు రూపాయలకే బియ్యాన్ని అందించి పేదల ఆకలి తీర్చిన మహానుభావుడని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు కొనియాడారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తాతకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళి

వర్షపు నీటిలో మునిగి వ్యక్తి మృతి..

For More AP News and Telugu News

Updated at - May 28 , 2025 | 10:57 AM