Share News

Pawan Kalyan: ప్రయాగ్‌రాజ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ABN , Publish Date - Feb 18 , 2025 | 12:26 PM

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా వెళ్లనున్నారు. ఈ సందర్బంగా అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. పవన్‌తో కలిసి యూపీ సీఎం యోగి కూడా పుణ్య స్నానం చేస్తారు.

Pawan Kalyan: ప్రయాగ్‌రాజ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్
AP Deputy CM Pawan Kalyan

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) కుటుంబ సమేతంగా ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj) మహాకుంభమేళా (Maha Kumbh Mela)కు వెళ్లనున్నారు. త్రివేణి సంగమం (Triveni Sangam)లో పవిత్ర స్నానం చేయనున్నారు. అనంతరం ప్రయాగ్ రాజ్‌లో ప్రత్యేక పూజలు చేస్తారు. పవన్‌ కల్యాణ్‌తో కలిసి యూపీ సీఎం యోగి (UP CM Yogi) పుణ్యస్నానం చేస్తారు. పవన్ రాకతో కుంభమేళాలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే కేరళ, తమిళనాడులోని పలు ఆలయాలు సందర్శించిన పవన్ మంగళవారం మధ్యాహ్నం ప్రయోగ్‌రాజ్‌కు బయలుదేరి వెళతారు.

ఈ వార్త కూడా చదవండి..

నోటీసు తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయిన ముద్రగడ


పుణ్య స్నానాలు ఆచరించిన లోకేష్ దంపతులు..

కాగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) దంపతులు కూడా మహాకుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి, హారతులు ఇచ్చారు లోకేష్ దంపతులు. ఆపై పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. పూర్వీకులకు మోక్షమార్గాన్ని ప్రసాదించాలంటూ గంగాదేవిని ప్రార్థించారు. కుంభమేళా ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు, నదీ సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లోకేష్ దంపతులు మమేకమయ్యారు. మహా కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు.. ఇది భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం. నమ్మకం, ఆచారాలు, ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న శక్తిమంతమైన వేడుక. మానవత్వం, ఆధ్యాత్మికత మధ్య సంబంధాన్ని, లోతుగా నాటుకుపోయిన భారతజాతి విలువలను ప్రతిబింభిస్తుంది. పవిత్ర నదుల్లో ఆచరించే స్నానం, దానం, హృదయ పూర్వకమైన భక్తి మోక్ష మార్గాన్ని చూపిస్తాయని కోట్లాదిమంది నమ్మకం. కుంభమేళాలో స్నానాలు, పూజాధికాల అనంతరం లోకేష్ దంపతులు కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని సందర్శించేందుకు వారణాసి వెళ్లారు.


కాగా.. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26తో ముగియనుంది. దాదాపు 45 రోజుల పాటు సాగే మహాకుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివెళ్తున్నారు. కోట్లలో భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు. రికార్డు స్థాయిలో 50 కోట్ల మంది భక్తులు స్నానమాచరించారని ఇది చరిత్రలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక తీర్థయాత్రగా యూపీ సర్కార్ పేర్కొంది.

కుంభమేళాను పొడిగించే ఆలోచన లేదు..

ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా వైభవంగా సాగుతోంది. భక్త జన కోటి తరలివచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట తర్వాత మహా కుంభమేళాను మరో రెండు రోజులు పొడిగించాలన్న డిమాండ్లు వినిపించాయి. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. కుంభమేళాను పొడిగించే ఆలోచనలేవీ లేవని తేల్చిచెప్పింది. ఈ నెల 26న మహాశివరాత్రి రోజునే కుంభమేళా ముగుస్తుందని స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మూడు రోజుల పాటు కాలువలోనే..

సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్‌ను ప్రారంభించనున్న సీఎం

సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణ

కౌన్సిలర్లను నిర్బంధిస్తున్న వైఎస్సార్‌సీపీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 18 , 2025 | 12:26 PM