Kumki Elephants: ఏపీకి కుంకీ ఏనుగులు అప్పగించిన కర్ణాటక ప్రభుత్వం
ABN , Publish Date - May 21 , 2025 | 02:26 PM
Kumki Elephants: ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామాల్లోకి ఏనుగులు దూసుకు వచ్చి.. పంటలను నాశనం చేస్తున్నాయి. అలాగే జనాలపై దాడి చేస్తున్నాయి. దీంతో గ్రామాల్లోని ప్రజలు ఊరు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి పోతున్నారు.

బెంగళూరు, మే 21: ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ఏరియాల్లో ఏనుగుల వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు శ్రీకాకుళం, సాలూరు ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉందన్నారు. అటవీ భూమిని ఆక్రమించడం వల్ల ఏనుగులే జనవాసాల్లోకి వస్తున్నాయో లేక ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. కానీ ఈ తరహా సమస్యను కర్ణాటక ప్రభుత్వం చాలా పకడ్బందీ ప్రణాళికతో నిరోధిస్తుందని తెలిపారు. అందులో భాగంగా ఈ ప్రభుత్వం చాలా ఏనుగులకు శిక్షణ ఇచ్చిందన్నారు. అంతేకాకుండా అవి ఎలా వ్యవహరించాలో కూడా శిక్షణ ఇచ్చారని చెప్పారు. ఇక ఏనుగులు జనావాసా ప్రాంతంలోకి రాకుండా.. వాటికి ప్రత్యేక మార్గం ద్వారా వెళ్లేలా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా ఆ ప్రాంతంలోని రైతుల భద్రతతో పాటు సురక్షిత చర్యలు తీసుకున్నట్లు అవుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగులు ఊళ్లలోకి దూసుకు వచ్చి.. పంట పొలాలను నాశనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల కారణంగా పలువురు మృత్యువాత పడుతున్నారు. ఏ సమయంలో ఎటువైపు నుంచి ఏనుగులు దాడి చేస్తాయో తెలియన ఓ విధమైన భయాందోళన పరిస్థితి ఆ ప్రాంత ప్రజల్లో నెలకొంది. అంతేకాకుండా.. ఈ ఏనుగుల దాడి కారణంగా.. పలు గ్రామాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.
అలాంటి వేళ ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఇలా ఏనుగులు దాడి చేయకుండా ఉండేందుకు కుంకీ ఏనుగులను రంగంలోకి దింపాలని ఆయన నిర్ణయించారు. ఆ క్రమంలో కర్ణాటక ప్రభుత్వంతో గతేడాది సెప్టెంబర్‌లో ఆరు కుంకీ ఏనుగులు ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. బుధవారం రాజధాని బెంగళూరులోని విధాన సౌదాలో సీఎం సిద్దరామయ్యతోపాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆరు కుంకీ ఏనుగులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వారు అప్పగించారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వానికి, సీఎం సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. కుంకీ ఏనుగులు ఏపీకి తీసుకు వస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
TDP MLA: ప్రాణాలకు తెగించి పోరాడిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి
Police Encounter: ఎన్‌కౌంటర్‌లో గ్యాంగస్టర్ సభ్యుడికి గాయాలు
Etela Rajender: కాళేశ్వరం విచారణకు హాజరువుతా
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం
Road Accident: డీసీఎంను ఢీకొట్టిన కారు.. ముగ్గురు స్పాట్ డెడ్..
CM Revanth Reddy: పాక్‌కి బుద్ది చెప్పడంలో ప్రధాని వెనకడుగు..
For AndhraPradesh News And Telugu News