Share News

YS Viveka Case: హత్య సినిమా యూనిట్‌కు వివేకా నిందితుడు నోటీసులు

ABN , Publish Date - Oct 17 , 2025 | 09:46 AM

హత్య సినిమాలో తన తల్లి పాత్రను అసభ్యంగా చిత్రీకరించారని ఆరోపిస్తూ.. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ ఆ చిత్ర యూనిట్‌కు నోటీసులు జారీ చేశారు.

YS Viveka Case: హత్య సినిమా యూనిట్‌కు వివేకా నిందితుడు నోటీసులు

కడప, అక్టోబర్ 1: హత్య సినిమాలో తన తల్లి పాత్రను అసభ్యంగా చిత్రీకరించారని మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో హత్య సినిమా యూనిట్‌కు సునీల్ కుమార్ యాదవ్ శుక్రవారం నోటీసులు పంపారు. ఈ అంశంపై ఏడు రోజుల్లో తనకు సమాధానం ఇవ్వాలని సినిమా యూనిట్‌ను డిమాండ్ చేశారు. అలా చేయకుంటే.. రూ. 5 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హత్య సినిమా యూనిట్‌కు స్పష్టం చేశారు. ఆ క్రమంలో శుక్రవారం సుప్రీంకోర్టు అడ్వకేట్ ద్వారా సదరు సినిమా యూనిట్‌కు సునీల్ నోటీసులు ఇచ్చారు.


2019, మార్చి 15వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పులివెందుల్లోని ఆయన స్వగృహంలో దారుణ హత్యకు గురయ్యారు. తొలుత గుండె పోటు అని ప్రకటించినా.. ఆ తర్వాత అది హత్య అని పోస్ట్‌మార్టం నివేదికలో స్ఫష్టమైంది. నాటి నుంచి ఈ హత్య కేసులోనే అనేక సందేహాలు నెలకొన్నాయి. తన తండ్రి హత్య కేసులో దోషులు ఎవరో తేలాలంటూ ఆయన కుమార్తె వైఎస్ సునీత డిమాండ్ చేశారు. ఆ క్రమంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు అందుకు సమ్మతి తెలపండంతో.. ఈ కేసును సీబీఐ చేపట్టింది.


మరోవైపు ఈ హత్యను ఆధారంగా చేసుకుని పలు చిత్రాలు టాలీవుడ్‌లో విడుదలయ్యాయి. వివేకం అంటూ ఒక చిత్రం విడుదల కాగా.. అందుకు ప్రతిగా హత్య పేరుతో మరో చిత్రం విడుదలైంది. ఈ ఏడాది జనవరి 25వ తేదీన ఓటీటీలో ఈ చిత్రం విడుదలైంది. అయితే ఈ చిత్రంలో తన తల్లి పాత్రను అభ్యంతరకరంగా చిత్రీకరించారని వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులు సునీల్ యాదవ్ ఆరోపించారు. అందులో భాగంగా ఈ చిత్ర యూనిట్‌కు అతడు నోటీసులు పంపాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

రికార్డు స్థాయిలో చీరమేను ధర.. పోటెత్తిన మాంసాహార ప్రియులు

డీజే సౌండ్ దెబ్బకు కూలిన గోడ.. ఏడుగురికి తీవ్ర గాయాలు

For More AP News And Telugu News

Updated Date - Oct 17 , 2025 | 10:03 AM