Share News

Srikakulam: డీజే సౌండ్ దెబ్బకు కూలిన గోడ.. ఏడుగురికి తీవ్ర గాయాలు

ABN , Publish Date - Oct 17 , 2025 | 09:42 AM

డీజే సౌండ్ దెబ్బకు భారీ గోడ కూలడంతో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం భవానీపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది.

Srikakulam: డీజే సౌండ్ దెబ్బకు కూలిన గోడ.. ఏడుగురికి తీవ్ర గాయాలు
Srikakulam

శ్రీకాకుళం, అక్టోబర్ 17: ఏపీలో జరిగిన అనూహ్య ఘటన ఒక్కసారిగా షాక్‌కు గురిచేస్తుంది. డీజే సౌండ్ దెబ్బకు భారీ గోడ కూలడంతో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం భవానీపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా గ్రామస్తులు నందన్న, గౌరమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల ముగింపు సందర్భంగా ఊరేగింపు చేపట్టారు. డీజేని సైతం ఏర్పాటు చేసి డ్యాన్సులు చేశారు. అయితే డీజే సౌండ్‌కి తీవ్రమైన వైబ్రేషన్స్ వచ్చి ఒక ఇంటి గుమ్మం కుప్పకూలిపోయింది. గోడ పక్కనే ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాతులను చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు. రంగంలోకి పోలీసులు.. డీజే సిస్టమ్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

Updated Date - Oct 17 , 2025 | 10:12 AM