Brahmamgari Matam: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. కూలిన వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం..
ABN , Publish Date - Oct 29 , 2025 | 11:24 AM
ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రంగా బ్రహ్మంగారిమఠం విరాజిల్లుతోంది. వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకునేందుకు నిత్యం రాష్ట్ర నలుమూల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు, భక్తులు తరలివస్తుంటారు.
కడప: మొంథా తుఫాన్ కారణంగా.. ఎన్నో నష్టాలు, అనర్థాలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మంగారిమఠంలో 16 శతాబ్దం నాటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పురాతన నివాసం కూలిపోయింది. తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నివాసం కూలిపోయింది. దీంతో అధికారులపైన, బ్రహ్మంగారి కుటుంబ సభ్యులపైన స్థానికులు, భక్తులు మండిపడుతున్నారు. అతి పురాతనమైన, చారిత్రాత్మక వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం పట్ల వారు శ్రద్ధ చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది శిథిలా వ్యవస్థలో ఉన్నప్పుడు కనీసం మరమ్మతులు కూడా చేయించలేదని ఆరోపిస్తున్నారు.
ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రంగా బ్రహ్మంగారిమఠం విరాజిల్లుతోంది. వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకునేందుకు నిత్యం రాష్ట్ర నలుమూల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు, భక్తులు తరలివస్తుంటారు. రోజురోజుకీ క్షేత్రం అభివృద్ధి చెందుతున్నా భక్తులకు కనీస వసతులు సమకూరడం లేదని ఇప్పటికే మఠంపై ఆరోపణలు ఉన్నాయి. వర్షం కురిసినా, ఎండ కాసినా నీడ కోసం భక్తులు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉందని భక్తులు, స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం కూలడంలో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
United Aircraft Corporation: భారత్‌లో పౌర విమానాల తయారీ
Lufthansa Flight Incident: లుఫ్తాన్సా విమానంలో ఘర్షణ