Share News

TDP : నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు?.. రగులుతున్న పసుపుసైన్యం.. ఎమ్మెల్యేలకు, పార్టీ కేడరుకు మధ్య పెరిగిన అగాధం

ABN , Publish Date - Sep 02 , 2025 | 01:18 PM

యువనేత, మంత్రి నారా లోకేశ్ టీడీపీకి భవిష్యత్తు ఆశాకిరణం. అలాంటి నేత మంగళవారం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నవారు తమకు లోకేశ్ భరోసా ఇస్తారని ఆశిస్తున్నారు.

TDP :  నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు?.. రగులుతున్న పసుపుసైన్యం.. ఎమ్మెల్యేలకు, పార్టీ కేడరుకు మధ్య పెరిగిన అగాధం
TDP leaders

  • అధికారం వచ్చి ఏడాది దాటినా భర్తీ కాని వైనం

  • వలస బ్యాచ్ కే పార్టీలో ప్రాధాన్యం

  • ఎమ్మెల్యేలకు, కేడరుకు మధ్య పెరిగిన అగాధం

  • రగులుతున్న పసుపుసైన్యం


ఆంధ్రజ్యోతి- కడప, ఆగస్టు 2 : యువనేత, మంత్రి నారా లోకేశ్ టీడీపీకి భవిష్యత్తు ఆశాకిరణం. కార్యకర్తల కోసం ఎంతకైనా తెగిస్తారని ఆయనకు పేరుంది. అందుకే తక్కువ కాలంలోనే కేడరు లోకేశను సొంతం చేసుకుంది. తమ భవిష్యత్ నేతగా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. అలాంటి నేత మంగళవారం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. మంత్రి హోదాలో పరిశ్రమలు, కళాశాల, స్మార్ట్ కిచెన్ సెంటర్లను ప్రారంభించనున్నారు.. కేడరు మాత్రం ఈ పర్యటనపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నవారు తమకు లోకేశ్ భరోసా ఇస్తారని ఆశిస్తున్నారు.

జగన్ సొంత జిల్లాలో టీడీపీకి కరుడుగట్టిన పసుపు సైన్యం ఉంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కూటమికి ఏడు అసెంబ్లీ సీట్లు కట్టబెట్టారు. తరువాత జరిగిన మహానాడు సూపర్ సక్సెస్ అయింది. ఇటీవల పులివెందుల, ఒంటిమిట్ట. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జగన్ కు మైండ్ బ్లాక్ చేసేలా టీడీపీకి పట్టం గట్టారు. టీడీపీపై, ఇటు పార్టీపై అభిమానం చూపుతున్నారు. అయితే అదే స్థాయిలో నామినేటెడ్ పోస్టుల భర్తీలో జిల్లాలోని కరుడుగట్టిన ఫ్యాన్స్ కు న్యాయం చేయకపోవడంతో కేడరు నిస్తేజంగా ఉంది.


పదవుల కోసం వెయిటింగ్

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అయితే కొన్ని చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు /ఇన్చార్జీలు కేడరు మధ్య భారీ గ్యాప్ వచ్చింది. తొలి ఆరు నెలల వరకు బాగున్నా తరువాత ఒక్కసారిగా కేడరులో ఆసంతృప్తి రగులుకుంది. కొందరు ఎమ్మెల్యేల తీరు మరీ అధ్వాన్నంగా ఉంది. టీడీపీ కేడరు కష్టపడితే గెలిచామన్న విషయాన్ని వదిలేసి తమ స్వశక్తితోనే గెలిచామనే స్థాయికి వచ్చేశారు. కేడరును పూర్తిగా వదిలేశారు. ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడంతా టీడీ పీలో ఇలాంటివారిదే పెత్తనం. దీంతో ముఖ్యంగా బలిజ, బీసీ, ఎస్టీ కులాల్లో అసంతృప్తి ఉంది. వారిని పట్టించుకోవడం వదిలేసి ఒక సామాజికవర్గాన్నే నెత్తి మంత్రి నారా లోకేశ్కు స్వాగతం పలుకుతున్న మంత్రి సవిత, పుత్తా చైతన్య రెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, వరదరాజులరెడ్డి, మాధవిరెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, భూపేశ్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, విజయమ్మ, సురేశ్ నాయుడు తదితరులున పెట్టుకుంటున్నారని అంటున్నారు. ఈ వ్యవహా రా న్ని పట్టించుకోకపోతే ఆ ప్రభావం రాబోవు రోజుల్లో కనిపిస్తుందని టీడీపీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


సమన్వయం ఏదీ?

సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఏడు సీట్లు కట్టబెట్టారు. ఏడాది పాలనపై జనంలో మంచి అభిప్రాయం ఉంది. అయితే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి గ్రౌండ్ స్థాయిలోకి వెళ్లడంలేదు. పసుపుజెండా కనిపిస్తే చెవి కోసుకునే కేడరును అంతా ఇప్పుడు నేతలు పట్టించుకోవడంలేదు. వారిని నిర్వీర్యం చేశారు. దీంతో పాటు జిల్లాలో టీడీపీ నాయకుల మధ్య సమన్వయం, సఖ్యత లేదు. టీడీపీలో ఉన్నత పదవులు పొందిన మాజీ ఎమ్మెల్సీ సతీశ్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్ ను లక్ష్యంగా ఘోరంగా విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలను జిల్లాలో టీడీపీ నేతలు తిప్పికొట్టలేక పోతున్నారు.. బీటెక్ రవి మాత్రమే కౌంటరు ఇస్తుండగా మిగతా నేతలంతా చేతులెత్తేశారు. ఇక సూపర్ సెక్స్ ఇతర పథకాల అభివృద్ధిపై వైసీపీ నేతలు అటు నేరుగా మీడియా, సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నప్పటికీ ధీటుగా బదులివ్వకపోవడం గమనార్హం. మహానాడు మినహాయిస్తే టీడీపీలో ఒక్క ప్రోగ్రాం కూడా వేదికపై లేదు. తెలుగుగంగ ప్రాజెక్టు, సాగునీరు, చేనేతలకు ఉచిత విద్యుత్.. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క కార్యక్రమం చేసి జగన్ బ్యాచ్ కు దీటుగా ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు.

కడప జిల్లాలో కేవలం సిక్స్ అవర్స్ పాలిటిక్స్ చేస్తారనే చర్చ ఆ వర్గాల్లో ఉంది. పగలు టీడీపీతో రాత్రి వైసీపీ బ్యాచ్లో ఉంటారనే ప్రచారం ఉంది. జగన్ హయాంలో మంత్రి నారా లోకేశ్ ను ఓ. యూట్యూబ్ స్టార్ ఘోరంగా విమర్శించారు. ఆ స్టార్ తో ఓ నేత డీల్ చేసుకున్నారన్న చర్చ ఉంది. వచ్చే ఎన్నికలకు జిల్లాలో పార్టీ బలోపేతం చేయా లంటే ముఖ్యంగా రాజకీయంగా అందరినీ ఏకతా టిపైకి తెచ్చుకోవాలి. జగన్ చేయని అభివృద్ధిని చేసి చూపించాలి. పులివెందులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పార్టీలోని చీడ పురుగులను, వైసీపీతో రాత్రిపూట అంటకాగే బ్యాచ్ను తీవ్రంగా మందలించాలి. లేదా పార్టీ కార్యక్రమాలకు అలాంటి వారిని దూరం పెట్టాలి. టీడీపీ వీరాభిమానులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు ది గ్రేట్.. సీబీఎన్‌ కు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అభినందనలు

250 కోట్ల మంది అకౌంట్లు ప్రమాదంలో.. జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక..

For More AP News And Telugu News

Updated Date - Sep 02 , 2025 | 01:19 PM