Share News

Sivaraththiri : శివరాత్రి వేళ.. దొంగ బాబాల ఉచ్చులో మహిళలు

ABN , Publish Date - Feb 26 , 2025 | 05:21 PM

Kadapa District: శివరాత్రి పర్వదినం వేళ.. ఉమ్మడి కడప జిల్లాలోని పోలతల క్షేత్రంలో దొంగ బాబాలు రెచ్చిపోయారు. దెయ్యలు, భూతాలు పేరిట మహిళలను ఉచ్చులోకి లాగారు. ఆ క్రమంలో వారిని విచక్షణారహితంగా కొడతున్నారు. వారి ఆర్తనాదాలతో సదరు క్షేత్రం మార్మోగుతోంది.

Sivaraththiri : శివరాత్రి వేళ.. దొంగ బాబాల ఉచ్చులో మహిళలు
Polathala Temple in Kadapa District

కడప, ఫిబ్రవరి 26: కడప జిల్లా శేషాచల పర్వత శ్రేణుల్లోని పొలతల క్షేత్రంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతోన్నాయి. శ్రీమల్లిఖార్జున స్వామి వారి దర్శనానికి భక్తులు బుధవారం పోటెత్తారు. అయితే దేవుడిపై నమ్మకంతో వచ్చే భక్తులను దొంగ బాబాలు, మంత్రగాళ్లు నిలువునా ముంచేస్తున్నారు. అంతేకాదు వారి ముఢ నమ్మకాలను క్యాష్ చేసుకొంటున్నారు. ఏటా పొలతల క్షేత్రంలో దొంగ బాబాలు చెలరేగి పోతారు. దెయ్యాలను తొలగిస్తామంటూ జనానికి దొంగబాబాలు టోపి పెడుతోన్నారు. మీ ఒంట్లో దెయ్యముంది.. వదిలిస్తామంటారు.

మీ ఆరోగ్యాన్ని కుదుట పడేలా చేస్తామని చెబుతారు. అలాగే ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిస్తామంటారు. ముఖ్యంగా ఆడవాళ్లను బుట్టలో పడేసి భయపెడతారు. వారి మాయ మాటలు నమ్మి పూజలో కూర్చొన్న భక్తులకు దొంగ బాబాలు నరకం చూపిస్తారు. మహిళల జుట్టు పట్టుకొని ఇష్టం వచ్చినట్లు కొడతారు. కాళ్లతో తంతూ..శాడిస్ట్‌లాగా ప్రవర్తిస్తారు. దెయ్యాన్ని వదిలిస్తామంటూ మూడేళ్ల చిన్నారి నుంచి 70 ఏళ్ల ముసలమ్మ వరకు అందరిని హింసిస్తారు.


దెబ్బలు తట్టుకోలేక బాధితులు ఆర్తనాదాలు పెడుతోంటే.. వారి కుటుంబ సభ్యులు మాత్రం అది చూస్తూ ఆనందిస్తారు. నిజంగానే దెయ్యం వదిలి వెళ్లిపోతుందని నమ్ముతుంటారు. అలాగే ఈ ఏడాది సైతం దొంగ బాబాల ఉచ్చులో పడి జనాలు ఒళ్లు హూనం చేసుకున్నారు. అంతే కాదు.. రూ. 5 వేలు నుంచి రూ. 10 వేల వరకు జేబు గుల్ల చేసుకున్నారు. శివరాత్రి వేళ.. దొంగ బాబాలు, మంత్రగాళ్లు చెలరేగిపోతున్నా.. పోలీసులు కానీ.. ప్రభుత్వాధికారులు కానీ చూసి చూడనట్లుగా వ్యవహరించడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.

Also Read: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు

Also Read: TGS RTC MahaLakshmi: ‘మహాలక్ష్మీ’తో ఆర్టీసీ సిబ్బంది.. ఇబ్బంది

Also Read: దోషులైన నేతలపై జీవిత కాల నిషేధం: కేంద్రం ఏమన్నదంటే..

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 26 , 2025 | 05:34 PM