Share News

BTech Ravi: రప్పా రప్పా అంటే భయపడే వాళ్లు ఎవరు లేరు

ABN , Publish Date - Jul 07 , 2025 | 06:23 PM

తనను కిడ్నాప్ చేసి చంపాలని చూశారని.. కానీ తాను మీడియా వల్ల బతికి బయటపడ్డానని పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బిటెక్ రవి తెలిపారు. రప్పా రప్పా అంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన తప్పు పట్టారు.

BTech Ravi: రప్పా రప్పా అంటే భయపడే వాళ్లు ఎవరు లేరు
TDP Leaders B Tech Ravi and R Srinivas reddy

కడప, జులై 07: కడపలో వైసీపీ నేతలు అంజాద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డిలు సంస్కృతి మరిచి మాట్లాడుతున్నారని పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బిటెక్ రవి విమర్శించారు. సోమవారం కడపలో బిటెక్ రవి విలేకర్లతో మాట్లాడుతూ.. రప్పా రప్పా అంటే భయపడే వాళ్లు ఎవరు లేరన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్‌లు ఇష్టానికి వాడుకున్నారని గుర్తు చేశారు. తనను సైతం కిడ్నాప్ చేసి హత్య చేయాలని వైసీపీ ప్రయత్నాలు సైతం చేసిందన్నారు.


కానీ కేవలం మీడియా వల్లే తాను బతికి బయటపడ్డానని వివరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలు సరికాదని ఆయన పేర్కొన్నారు. ఏడాది పాలనలో దాదాపు అన్ని హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని గుర్తు చేవారు. ఏడాది పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో జగన్ బ్రాండ్ మద్యం తాగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. సీఎం చంద్రబాబు పాలనతో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. వైసీపీ నేతల రప్పా రప్పా కామెంట్లు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.


మరోవైపు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ రప్పా రప్పా అంటే.. కడపలో ఆయన మేనమామ రవీంద్ర నాథ్ రెడ్డి, అంజాద్ బాషాలు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్ళీ వైసిపీ శ్రేణులు రప్పా రప్పా మాట్లాడుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని గుర్తు చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ పనులు సైతం ప్రారంభమైనాయన్నారు.


రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు తపిస్తున్నారని వివరించారు. వైసీపీ ఈ తరహా వ్యాఖ్యలకు టీడీపీ భయపడదన్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలకు ప్రజలు ఇప్పటికే విసిగిపోయారని వివరించారు. 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అడ్డదార్లు తొక్కిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. సంస్కారం లేకుండా మాట్లాడితే ప్రజలే బుద్ది చెప్తారని వైసీపీ నేతలకు శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కేవలం రూ.100తో భూముల రిజిస్ట్రేషన్‌..

వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 07 , 2025 | 07:00 PM