Kadapa News: అరటి రైతుపై ప్రభుత్వం ఫోకస్.. మద్దతు ధరతో కొనుగోలుకు రంగం సిద్ధం
ABN , Publish Date - Nov 25 , 2025 | 09:59 AM
అరటి రైతుపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ సాగును లాభసాటిగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా మద్దతు ధరతో కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా డిసెంబరు 15 నుంచి నార్త్ నుంచి వ్యాపారులు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేసింది.
- డిసెంబరు 15 నుంచి నార్త్ నుంచి వ్యాపారులు రాక
- కలెక్టరు చెరుకూరి శ్రీధర్ ప్రత్యేక చొరవ
- వ్యాపారులతో కాన్ఫరెన్స్
- పక్వానికి వచ్చిన కాయలనే కోయండి - కలెక్టర్
(కడప - ఆంధ్రజ్యోతి):
కడప.. ఇప్పుడు పండ్లతోటల ఖిల్లా.. అరటి, సపోటా, మామిడి, జామ, డ్రాగన్ ఫ్రూట్, బత్తాయి ఇలా పలు హార్టికల్చర్ పండ్లతోటలకు హబ్‌గా మారు తోంది. అయితే మార్కెట్ ధరలకు అనుగుణంగా కటింగ్ చేయకపోవడం, ముందస్తు పంట కారణంగా పంటచేతికి వచ్చినప్పుడు ధరలో వ్యత్యాసం ఉంటోంది. ప్రస్తుతం జిల్లాలో అరటి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అరటి సీజన్ డిసెంబరు 15 నుంచి మొదలవుతుంది. మన దగ్గర పండే పంట అంతా ఎక్కువ శాతం నార్త్ అంటే ఢిల్లీ, పంజాబ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. డిసెంబరు వచ్చిందంటే చాలు నార్త్ కు చెందిన పలు కంపెనీలకు చెందిన వ్యాపారులు కడప, పులివెందుల, మైదుకూరు, కాశినాయన మరికొన్ని చోట్ల వాలిపోయి అరటి పండ్లు కొనుగోలు చేసేందుకు ఎగబడు తుంటారు.
జిల్లాలో ఈక్రాప్ మేరకు 13,820 హెక్టార్లలో అరటి సాగైంది. అత్యధికంగా లింగాలలో 5350 హెక్టార్లు, పులివెందులలో 1660, వేముల 1287, సింహాద్రిపురం 1256, కాశినాయన 1237, మైదుకూరు 849, కొండాపురం 718, ఒంటిమిట్ట 171, తొండూరు, సీకేదిన్నెలో 169, పెండ్లిమర్రిలో 153, బి.మఠంలో 140, వీఎన్‌పల్లె 114, ముద్దనూరులో 83 హెక్టార్లలో సాగైంది. ఖాజీపేట, సిద్దవటం, దువ్వూరు, పోరుమామిళ్ల, కలసపాడు, ఎర్రగుంట్ల, అట్లూరు, గోపవరం, చాపాడు, వల్లూరు తదితరాల్లో 30 ఎకరాల్లో సాగులో ఉంది.
అరటి ధరపై వైసీపీ దుష్ప్రచారం
జిల్లాలో సాగులో ఉన్న అరటిలో ప్రధానంగా మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో సాగులో ఉంది. ఆ తరువాత ఇటీవల కాలంలో కాశినాయన మండలంలో సాగవుతోంది. ప్రతి యేటా అరటి సీజన్ డిసెంబరు 15 నుంచి మొదలవుతుంది. మన వద్ద పండే పంట అంతా నార్త్ ఇండియా ఢిల్లీ, పంజాబ్, ఇతర ప్రాంతాలకు ట్రాన్స్‌పోర్టు అవుతుంది. దీంతో అక్కడి వ్యాపారులంతా ఎక్కువ సాగు ఉన్న పులివెందులలోనే మకాం వేస్తారు. ఇంకా సీజన్ స్టార్ ్ట అయ్యేందుకు 20 రోజులు సమయం ఉంది. అయితే కొందరు రైతులు ముందస్తుగా అరటిని సాగు చేశారు.

దీంతో డిమాండ్ లేని సమయంలో దిగుబడి వస్తోంది. అలాగే ప్రస్తుతం ఽథర్డ్ క్వాలిటీ పంట కోస్తున్నారు. వాస్తవంగా మొదటి రకం, రెండో రకం అరటికే ధర ఉంటుంది. ఈ రకాలు నార్త్ ఇండియాకు ఎగు మతి అవుతుంటాయి. మూడోరకం క్వాలిటీ స్థానికంగా ఉండే తోపుడుబండ్లకు వస్తుం టాయి. వీటి ధర కూడా తక్కువగా ఉంటుంది. అయితే దీనిపై వైసీపీ ధరలు లేవంటూ ప్రచారానికి తెర లేపుతోంది. మాజీ సీఎం జగన్ రెండురోజుల పులివెందుల పర్యటనకు వస్తున్నారు. అరటి రైతులను కూడా పరామర్శిం చేలా పక్కాగా పొలిటికల్ మైలేజ్ కోసం షెడ్యూలు ఫిక్స్ చేశారు. అయితే ఇదంతా పొలిటికల్ మైలేజీగా పరిస్థితి అర్థమవుతోంది.
ఇప్పుడు ధర ఇలా....
మొదటి రకం క్వాలిటీ ఉన్న అరటి పండ్లు కేజీ రూ.8 నుంచి 10 మధ్య కొనుగోలు చేస్తు న్నారు. రెండో రకం పండ్లను రూ.6 నుంచి 4 మధ్య పలుకుతుంది. మూడో రకం పంట పూర్తయిన తరువాత రైతులు సాధారణంగా తోటలో వదలేస్తుంటారు. కొందరు వాటిని ఏరుకోవడం, లేక తీసుకుని అమ్ముతుంటారు. వీటిని తోపుడుబండ్లకు వేస్తారు. వీటిని కిలో రూ.2.50 నుంచి రూ.3కు కొనుగోలు చేస్తారు. ఈ రకం కొనుగోలు కేవలం 5శాతం మాత్రమే ఉంటుంది.
కలెక్టరు ప్రత్యేక దృష్టి
వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) సూచనల మేరకు కలెక్టరు చెరకూరి శ్రీధర్ అరటి రైతులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. డిసెంబరు 15 నుంచి సీజను ప్రారంభం కానుంది. కలెక్టరు శ్రీధర్ నార్త్‌కు చెందిన బనానా మార్కెట్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఉన్న అరటి సాగు క్వాలిటీ, ఎన్ని టన్నులు దిగుమతి అవుతుంది, ధర తదితర విషయాలపై ఫోకస్ పెట్టారు. నార్త్ వ్యాపారులు కడపకు వచ్చేలా ఈ నెల 15 నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
నా పేరు బాలిరెడ్డి, నాది లింగాల మండలం మురారి చింతల. నేను మూడు ఎకరాల్లో అరటి సాగు చేశాను. 18 టన్నుల దిగుమతి వచ్చింది. 9 రూపాయలతో అమ్మడం జరిగింది.

నా పేరు జింకల హరిప్రసాద్, పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె. ఎస్‌కే కంపెనీకి టన్ను రూ.8500తో విక్రయించాను.

ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి.. పసిడి, వెండి ధరల్లో కోత
అది బూటకపు ఎన్‌కౌంటర్: ఈశ్వరయ్య
Read Latest Telangana News and National News