Private Bus Driver: జస్ట్ మిస్.. ఘోర ప్రమాదం తప్పింది.. వీడియో చూస్తే హడలే..!
ABN , Publish Date - Oct 25 , 2025 | 03:23 PM
కర్నూలు జిల్లాలో నిన్న(శుక్రవారం) జరిగిన ఘోర బస్సు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో 19మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్రంగా కలిచి వేసింది. ఇదే సమయంలో ప్రైవేటు బస్సుల డ్రైవర్లపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కర్నూలు, అక్టోబర్ 25: జిల్లాలో నిన్న(శుక్రవారం) జరిగిన ఘోర బస్సు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో 19మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్రంగా కలిచి వేసింది. ఇదే సమయంలో ప్రైవేట్ బస్సుల డ్రైవర్లపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కర్నూలు సంఘటన మరుక ముందే ఓ డ్రైవర్.. బస్సును అత్యంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడు. బస్సు ఎక్కాలంటేనే భయపడేలా నడిపాడు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తే షాక్ అవ్వాల్సిందే.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్.. ఎంతో నిర్లక్ష్యంగా(private travels negligence) బస్సును నడిపాడు. శనివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో సదరు డ్రైవర్.. బస్సును లారీల మధ్యలో నుంచి వేగంగా తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఓ లారీకి అతి సమీపం నుంచి బస్సును క్రాస్ చేశాడు. తృటిలో పెనుప్రమాదం తప్పింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, వాటి డ్రైవర్లు నిర్లక్ష్యం(private bus driver)గా నడపడం వల్ల హైవేలపై జరుగుతున్న ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే అంటూ ఆ వీడియోను పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ కావడంతో నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి డ్రైవర్ల వల్లే కదా.. ఎన్నో కుటుంబాల్లో చీకట్లు అలుముకుంటున్నాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రైవేట్ బస్సులకు స్పీడ్ లిమిట్ పెట్టకుంటే కర్నూలు ప్రమాదం తరహా ఘోరాలు చూస్తూనే ఉండాలని మరికొందరు అంటున్నారు. ఇదే సమయంలో ప్రైవేటు బస్సుల డ్రైవర్ల(private bus driver recklessly)పై ప్రయాణికులు సైతం ఆరోపణలు చేస్తున్నారు. చాలా నిర్లక్ష్యంగా బస్సులను డ్రైవ్ చేస్తుంటారని, కొన్నిసార్లు తమ గమ్యం చేరేవరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించిన సందర్భాలు ఉన్నాయని పలువురు తమ అనుభవాలను కామెంట్స్ చేశారు. ప్రైవేటు ట్రావెల్స్(Private Travels) పట్ల ప్రభుత్వాలు కఠినంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!
ఆస్ట్రేలియా పర్యటనపై లోకేష్ ఆసక్తికర ట్వీట్
Read Latest AP News And Telugu News