Share News

Jogi Ramesh Fake Liquor Case: జోగి రమేష్‌ను 10 రోజుకు కస్టడీ కోరుతూ ఎక్సైజ్ శాఖ పిటిషన్

ABN , Publish Date - Nov 03 , 2025 | 08:25 PM

జోగి రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రామును 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్‌శాఖ కోర్టును కోరింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటి(మంగళవారం)కి వాయిదా వేసింది.

Jogi Ramesh Fake Liquor Case: జోగి రమేష్‌ను 10 రోజుకు కస్టడీ కోరుతూ ఎక్సైజ్ శాఖ పిటిషన్
Jogi Ramesh

విజయవాడ, నవంబర్ 3: నకిలీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌(Jogi Ramesh)ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎక్సైజ్‌శాఖ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. జోగి రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రామును 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటి(మంగళవారం)కి వాయిదా వేసింది. ఇదే కేసులో అద్దేపల్లి సోదరులను ఎక్సైజ్‌ శాఖ(Excise Department) రెండోసారి కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ ఈ నెల 6కి వాయిదా పడింది.


నకిలీ మద్యం కేసు(Fake Liquor Case)లో మాజీ మంత్రి జోగి రమేశ్ , ఆయన తమ్ముడు జోగి రాము(Jogi Ramu)కు ఈనెల 13 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారిద్దర్నీ విజయవాడ జైలు నుంచి నెల్లూరు జైలు(Nellore Jail)కు తరలించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్‌ నివాసంకి వెళ్లిన సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడకు తరలించి.. తూర్పు ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో సుమారు 12 గంటలపాటు విచారించారు. వైద్య పరీక్షల అనంతరం ఎక్సైజ్‌శాఖ(Excise Department) అధికారులు, పోలీసులు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయి. కోర్టు తెల్లవారుజామున 5 గంటలకు రిమాండ్‌ విధిస్తూ తీర్పు వెలువరించారు.



ఈ వార్తలు కూడా చదవండి...

కృత్రిమ మేధస్సుతో అడవి ఏనుగుల సమస్య పరిష్కారం: పవన్ కల్యాణ్‌

మంచి వెనకే చెడు.. అంతా డైవర్ట్‌ కోసమేనా?.. వర్మ అనుమానాలు

Updated Date - Nov 03 , 2025 | 08:25 PM