Pattabhi Ram: ఖజానాకు 2,719 కోట్లు ఆదా చేశాం
ABN , Publish Date - May 07 , 2025 | 03:42 AM
యాక్సిస్ ఎనర్జీతో ఒప్పందం ద్వారా రాష్ట్రానికి రూ.2,720 కోట్లు ఆదా అయినా, జగన్ దుష్ప్రచారం కొనసాగిస్తున్నారు. సెకీతో 2.49కే ఒప్పందం కుదుర్చుకున్నా, ఆ ఒప్పందం మరియు యాక్సిస్ ఒప్పందం మధ్య తేడాలు గోచరించకుండా విమర్శలు చేస్తున్నారు
అయినా మాజీ సీఎం దుష్ప్రచారం.. సెకీతో 2.49కి ఒప్పందం
చేసుకుంటే పీక్ అవర్స్‌లో 11.78కి ఎందుకు కొన్నారు?: పట్టాభి
యూనిట్‌కు రూ.5.12 చెల్లిస్తామని ఆయన అగ్రిమెంటు
మేం 4.60కే తగ్గించి ఒప్పందం చేసుకున్నాం: టీడీపీ
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): యాక్సిస్ ఎనర్జీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)లో అక్రమాల జరిగాయంటూ జగన్ చేస్తున్న దుష్ప్రచారమంతా తన తప్పు కప్పిపుచ్చుకునేందుకేనని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం విమర్శించారు. ఆ సంస్థతో 2022 నవంబరు 24న జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, దాని ప్రకారం 2022-23, 23-24 సంవత్సరాలకు యూనిట్‌కు రూ.5.12 చొప్పున చెల్లించేందుకు అంగీకరించిందని తెలిపారు.
ఆ ధరను రూ.4.60కి తగ్గిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం అదే యాక్సిస్ ఎనర్జీతో ఒప్పందం చేసుకుంటే జగన్ ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు. తాజా ఒప్పందం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2,720 కోట్లు ఆదా చేశామన్నారు. జగన్ హయాంలో సెకీతో రూ.2.49కే ఒప్పందం చేసుకున్నట్లు ఆయన రోత పత్రికలో బుకాయిస్తున్నారని.. కానీ ఆ ఒప్పందానికి, యాక్సిస్ ఎనర్జీతో చేసుకున్న ఒప్పందానికి ఉన్న తేడాను చెప్పకుండా ఎందుకు దాస్తున్నారని నిలదీశారు. సెకీ విషయంలో వారు నిర్దేశిత సమయంలో ఇచ్చినప్పుడే మనం విద్యుత్ తీసుకోవాలని.. కానీ యాక్సిస్ ఎనర్జీ మన డిమాండ్‌ను బట్టి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
PAN Card: పాన్ కార్డులో ఎవరికైనా తండ్రి పేరే ఉంటుంది.. ఎందుకో తెలుసా..
Security Mock Drill: హైదరాబాద్‌లోని ఆ నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్.. ఎప్పుడంటే..
India - Pakistan war: యుద్ధానికి సిద్ధమా.. తర్వాత పరిస్థితి ఏమిటి
Minister Satya Kumar: వైద్యులపై హెల్త్ మినిస్టర్‌కు ఫిర్యాదు.. విచారణకు ఆదేశం
CM Chandrababu: ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్
For Andhrapradesh News And Telugu News