Share News

India PM: మోదీ తర్వాత ప్రధాని రేసులో చంద్రబాబు లేదా లోకేష్.. రాయిటర్స్ అంచనా

ABN , Publish Date - Dec 22 , 2025 | 10:38 AM

ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక ఆసక్తికరణ విశ్లేషణ చేసింది. 2029లో భారత ప్రధానిగా నారా చంద్రబాబు నాయుడు, లేదా నారా లోకేష్‌కు ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ అనాలసిస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

India PM: మోదీ తర్వాత ప్రధాని రేసులో చంద్రబాబు లేదా లోకేష్.. రాయిటర్స్ అంచనా
India PM race after Modi

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 22: ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ సంచలన విశ్లేషణను బయటపెట్టింది. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి భారత ప్రధాని మోదీ వయస్సు 79 ఏళ్లకు చేరుతుందని, ఆ సమయంలో ఆయన క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుంటే వారసులెవరు అనే కోణంలో ఒక ఆసక్తికర అనాలసిస్ చేసింది.

భారత ప్రధాని రేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పేర్లను ప్రస్తావించింది. ఒకవేళ 2029లో బిజెపికి స్పష్టమైన మెజారిటీ రాకుండా, ఎన్డీయే కూటమిలోని ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే, అప్పుడు దక్షిణాది నేతగా చంద్రబాబుకు, లేదా నారా లోకేష్‌కు అవకాశం దక్కవచ్చని రాయిటర్స్ అభిప్రాయపడింది.


రాయిటర్స్ వెలువరించిన విశ్లేషణ ప్రకారం, బిజెపిలో మోదీ తర్వాత అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్న అమిత్ షా మొదటి వరుసలో ఉన్నారు. తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ పేరును కూడా రాయిటర్స్ పరిగణనలోకి తీసుకుంది.

అయితే, క్షేత్రస్థాయిలో అత్యంత ప్రజాదరణ పొందిన యోగి ఆదిత్యనాథ్ పేరును రాయిటర్స్ విస్మరించింది. మోదీ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న నేతను కాదని ఫడ్నవీస్ పేరును తెరపైకి తేవడం వెనుక రాయిటర్స్ లాజిక్ ఏంటన్నది ప్రశ్నార్థకం.


ఇవి కూడా చదవండి..

ఆర్ఎస్ఎస్‌ను బీజేపీ కోణంలో చూడటం తప్పు: మోహన్ భాగవత్

మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 22 , 2025 | 10:41 AM