AP Politics: వైసీపీ నేతలకు హోమంత్రి వార్నింగ్..
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:32 PM
వైసీపీ నేతల తీరుపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి టీవీ, పేపర్‌లో అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 14 నెలల కాలంలోనే అనేక సంక్షేమ పథకాలు చేపట్టామని..
అమరావతి, ఆగస్టు 19: వైసీపీ నేతల తీరుపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి టీవీ, పేపర్‌లో అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 14 నెలల కాలంలోనే అనేక సంక్షేమ పథకాలు చేపట్టామని.. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారామె. వీటిని చూసి ఓర్వలేకనే తప్పుడు ప్రచారాలతో ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీపై హోమంత్రి అనిత తీవ్ర విమర్శలు చేశారు. అబద్దాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ హయాంలోనూ అవే అవాస్తవాలను ప్రచారం చేశారని దుయ్యబట్టారు.
ఉదయం లేచింది మొదలుకొని అమరావతి మునిగిపోయింది అని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో నిర్మాణాల వద్ద పునాదుల వద్ద కాస్త నీరు చేరవా అని ఆమె ప్రశ్నించారు. నెగిటివ్ యాంగిల్‌లో సోషల్ మీడియాలో ప్రోజెక్ట్ చేయడం దారుణమన్నారు. అమరావతి మహిళా రైతులు నాడు బయటకు వచ్చి పాదయాత్రలు చేసి అమరావతిని నిలబెట్టారని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ అమరావతిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మునిగిపోతుంది.. పొన్నూరు వైపు నీటిని డైవర్ట్ చేశారని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని అనిత ఫైర్ అయ్యారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read:
కర్నూల్ జిల్లా విద్యార్థిని ఉన్నత చదువుకు ఎన్నారై సాయం
కస్టమర్లకు షాక్.. మళ్లీ పెరగనున్న ధరలు
For More Andhra Pradesh News and Telugu News..