Road Accident: ఘోర ప్రమాదం.. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రావొద్దు..
ABN , Publish Date - Feb 09 , 2025 | 07:39 PM
ఆంధ్రప్రదేశ్: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. బొల్లవరం గ్రామానికి పని నిమిత్తం వెళ్లిన మహిళా కూలీలకు అనుకోని ఘటన ఎదురైంది.

పల్నాడు: జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) సంభవించింది. ముప్పాళ్ల (Muppalla) మండలం బొల్లవరం వద్ద ట్రాక్టర్ బోల్తాపడి (Tractor overturns) నలుగురు కూలీలు మృతిచెందారు. చాగంటివారిపాలెంకు చెందిన 25 మంది మహిళా కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం బొల్లవరం గ్రామానికి ఇవాళ (ఆదివారం) ఉదయం వెళ్లారు. ఎప్పటిలాగానే రోజంతా హుషారుగా పని చేసిన కూలీలు సాయంత్రం సమయానికి ఇంటికి బయలుదేరారు. బొల్లవరంలో ట్రాక్టర్ ఎక్కి కొద్ది దూరం ప్రయాణించే సరికే ప్రమాదవశాత్తూ వాహనం బోల్తాపడింది.
Nellore: ఏపీలో మరో దారుణం.. ఏడో తరగతి విద్యార్థినిపై.. బాబోయ్..
ఈ ప్రమాదంలో గంగమ్మ, సామ్రాజ్యం, మాదవి, పద్మ అనే నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, కుటుంబసభ్యుల మరణవార్త విని బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రికి వద్దకు చేరుకుని బోరున విలపించారు. గ్రామానికి చెందిన నలుగురు ఒకేసారి మృతిచెందడంతో చాగంటివారిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kayan: స్వయం పరిపాలనకు ఆ గ్రామమే నిదర్శనం: డిప్యూటీ సీఎం ప్రశంసలు..
Nellore: జిల్లాలో పర్యటిస్తున్న ఐదుగురు మంత్రులు.. ఏఏ కార్యక్రమాలు ప్రారంభించారంటే..