Share News

Nellore: ఏపీలో మరో దారుణం.. ఏడో తరగతి విద్యార్థినిపై.. బాబోయ్..

ABN , Publish Date - Feb 09 , 2025 | 06:34 PM

నెల్లూరులోని ఓ శిశుమందిర్‌లో ఏడో తరగతి చిన్నారిపై వ్యాన్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజూ చిన్నారిని బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి ఒడికట్టాడు కామాంధుడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించేవాడు.

Nellore: ఏపీలో మరో దారుణం.. ఏడో తరగతి విద్యార్థినిపై.. బాబోయ్..
Nellore

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరస అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం ఘటన వెలుగు చూసిన గంటల వ్యవధిలోనే మరో దారుణం వెలుగు చూసింది. నెల్లూరులోని ఓ శిశుమందిర్‌లో ఏడో తరగతి చిన్నారిపై వ్యాన్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజూ చిన్నారిని బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి ఒడికట్టాడు కామాంధుడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించేవాడు.


విద్యార్థిని కడుపునొప్పితో తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వ్యాన్ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇదే పాఠశాలలో గతంలోనూ పలువురు విద్యార్థినిలు లైంగిక వేధింపులకు గురయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. వరస సంఘటనలతో విద్యార్థినిల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇంజినీరింగ్ విద్యార్థినిపై..

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో ఇంజినీరింగ్ విద్యార్థిపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. పరిటాలలో పెయింటింగ్ పనిచేస్తున్న షేక్ హుస్సేన్ ప్రేమ పేరిట బీటెక్ విద్యార్థినిని లోబర్చుకున్నాడు. తన స్నేహితుడు సిద్దు ఉంటున్న రూమ్‌లో ఆమెను ఉంచి హుస్సేన్ బయటకు వెళ్లిపోయాడు. అతను బయటికి వెళ్లిపోయిన తర్వాత సిద్దు సదరు యువతిపై అత్యాచారం చేశాడు. అలాగే న్యూ్డ్ ఫొటోలు తీసి అతని స్నేహితులకు చూపించాడు. ఆమెపై పలుమార్లు బెదిరింపులకు దిగాడు. సిద్దు వేధింపులు తాళలేక విద్యార్థిని కంచికచర్ల పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసింది. ఘటనపై సీరియస్ అయిన పోలీసులు ఏ-1గా సిద్దు, ఏ-2గా హుస్సేన్, ఏ-3గా ప్రభుదాస్‌ పేర్కొంటూ కేసు నమోదు చేశారు. నిందితుడు సిద్ధుని అదుపులోకి తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Pawan Kayan: స్వయం పరిపాలనకు ఆ గ్రామమే నిదర్శనం: డిప్యూటీ సీఎం ప్రశంసలు..

Nellore: జిల్లాలో పర్యటిస్తున్న ఐదుగురు మంత్రులు.. ఏఏ కార్యక్రమాలు ప్రారంభించారంటే..

Updated Date - Feb 09 , 2025 | 07:16 PM