Tirumala Laddu: శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:32 PM
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితోపాటు చిన్నప్పన్నకు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్పన్నకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. చిన్నప్పన్నకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ముగ్గుర సభ్యుల ధర్మాసనం శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు చెప్పిన వారిని కాకుండా.. మరొకరిని సిట్‌లో నియమించారంటూ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్పన్న హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపి.. చిన్నప్పన్నకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయితే ఈ అంశంలో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం స్టే విధించింది.
ఇవి కూడా చదవండి
ఐటీ ఉద్యోగులు ఎగిరి గంతేసే లాంటి వార్త..
అతిభారీ వర్షాలు.. తీర ప్రాంతాలకు అలెర్ట్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి