Share News

Minister Gottipati: వైసీపీ అధినేత జగన్‌పై నిప్పులు చెరిగిన మంత్రి గొట్టిపాటి.. విషయం ఇదే..

ABN , Publish Date - Jan 19 , 2025 | 05:08 PM

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పోడుస్తున్నారంటూ వైసీపీ చేసే విష ప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మొద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) తెలిపారు.

Minister Gottipati: వైసీపీ అధినేత జగన్‌పై నిప్పులు చెరిగిన మంత్రి గొట్టిపాటి.. విషయం ఇదే..
Power Minister Gottipati Ravikumar

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పోడుస్తున్నారంటూ వైసీపీ చేసే విష ప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మొద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) తెలిపారు. విద్యుత్ వ్యవస్థపై వైసీపీ (YSRCP) అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కక్షపెట్టుకున్నారని, అందుకే రోజూ అసత్యాలతో బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు విధ్వంసం చేసిన జగన్.. విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మంత్రి ధ్వజమెత్తారు. అలాంటి పరిస్థితుల నుంచి సీఎం చంద్రబాబు తన అనుభవంతో ఆ వ్యవస్థను సరిదిద్దారని చెప్పారు. ఇదే ఆయన అనుభవానికి నిదర్శమని గొట్టిపాటి చెప్పుకొచ్చారు.


అసత్యాలెందుకు జగన్..?

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ అందిస్తుండటాన్ని చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారని, అందుకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల ప్రయోజనంపై అవగాహన లేకపోవడం వల్లే జగన్ అసత్యాల ప్రచారం ప్రారంభించారని మండిపడ్డారు. ఈ పథకాల ప్రయోజనాలేంటో దీర్ఘకాలంలో ప్రజలు తెలుసుకుంటారని మంత్రి చెప్పారు. ఎలాంటి అదనపు భారం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించే ఈ పథకాల వల్ల నష్టమేంటో జగన్ మోహన్ రెడ్డి చెప్పాలంటూ మంత్రి గొట్టిపాటి డిమాండ్ చేశారు.


నాణ్యమైన విద్యుత్ వద్దా?

సూర్యఘర్, పీఎం కుసుమ్ వల్ల విద్యుత్ వినియోగదారులకు మరింత లబ్ధి చేకూరుతుందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు ఉచితంగా నాణ్యమైన కరెంట్ మరింత మెరుగ్గా అందించవచ్చని ఆయన చెప్పారు. రైతులకు ఫీడర్ లెవల్‌లోనే నాణ్యమైన విద్యుత్‌ను జగన్ వద్దంటారా? అంటూ మంత్రి ప్రశ్నించారు. సూర్యఘర్ పథకం ద్వారా క్వాలిటీ గల విద్యుత్ గృహ వినియోగదారులకు అందుతుందని గొట్టిపాటి వెల్లడించారు. జగన్ నిర్లక్ష్యం చేసిన ఈ పథకాలను ఎన్డీయే ప్రభుత్వం అందిపుచ్చుకోవటాన్ని చూసి ఆయన ఓర్వలేకపోతున్నారని మంత్రి నిప్పులు చెరిగారు.


ఒక్కటైనా ఉందా?

కుప్పంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సూర్యఘర్ పథకం త్వరలో ఏపీ మెుత్తం అమలు చేస్తామని మంత్రి రవికుమార్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు సౌరవిద్యుత్ ఫలకాలు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో విప్లవాత్మక మార్పులు అందిపుచ్చుకోవటంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని మంత్రి చెప్పారు. ఏ మంచి పథకంపైనైనా విషం చిమ్మి వ్యవస్థను నాశనం చేసేందుకు జగన్ సైతం ముందే ఉంటారని గొట్టిపాటి ధ్వజమెత్తారు. ఇద్దరి పాలన మధ్య తేడా ఏంటో ఏపీ ప్రజలకు బాగా తెలుసంటూ చురకలు అంటించారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో గర్వంగా చెప్పుకునే పథకం ఒక్కటైనా ఉందా? అంటూ ప్రశ్నించారు. జగన్‌కు ఒక్క అవకాశమని నమ్మి గెలిపిస్తే ఏపీని 20 ఏళ్లు వెనక్కి నెట్టారని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Tirumala: తిరుమల వెంకన్నకు భూరి విరాళం.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

Vijayawada: గిరిజన-ఆదివాసీ సమ్మేళనం.. మాజీ ఉపరాష్ట్రపతి ఏం చెప్పారంటే..

Updated Date - Jan 19 , 2025 | 05:11 PM