Share News

Pawan Kalyan Congratulates Nitin Nabin: నితిన్ నబిన్‌కు డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు

ABN , Publish Date - Dec 14 , 2025 | 08:17 PM

బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబిన్ నియమితులయ్యారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

Pawan Kalyan Congratulates Nitin Nabin: నితిన్ నబిన్‌కు డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు

అమరావతి, డిసెంబర్ 14: బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఆదివారం నియమితులయ్యారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. బీజేపీలో యువజన విభాగంలో ఆయన సేవలందించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బిహార్ రాష్ట్ర రాజకీయాలతోపాటు ప్రజా జీవితంలో నితిన్ నబిన్ క్రియాశీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రస్తుతం బిహార్‌లో నితీష్ కేబినెట్‌లో మంత్రిగా ఆయన సేవలందిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.


ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా.. ఎన్.డి.ఏను పటిష్టంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఆ స్ఫూర్తిని నితిన్ నబిన్ బలంగా ముందుకు తీసుకు వెళ్తారని ఆకాంక్షిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్ చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్ష్యుడిగా నితిన్ నబిన్ నియామకంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విధంగా స్పందించారు.


బిహార్‌కు చెందిన నితిన్ నబిన్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయనకు ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటి వరకు పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న జేపీ నడ్డా.. ఆ పదవికి రాజీనామా చేయనున్నారు. ఆ వెంటనే ఆ బాధ్యతలను నితిన్ నబిన్ స్వీకరించనున్నారు. చాలా కాలంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతున్నారు.


ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయన కేబినెట్‌లో ఆరోగ్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా బాధ్యతలు చేపట్టారు. అనంతరం పార్టీ అధ్యక్ష బాధ్యతలు సీనియర్ నాయకుడిని ఎంపిక చేసి.. వారికి అప్పగిస్తారంటూ ప్రచారం జరిగింది. ఆ క్రమంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. అనంతరం జాతీయ అధ్యక్షుడి పదవికి నితిన్ నబిన్‌ను ఎంపిక చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్‌పీ భేటీ.. ఎప్పుడంటే..?

For More AP News And Telugu News

Updated Date - Dec 14 , 2025 | 08:19 PM